# Tags
#తెలంగాణ

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా,

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, బియ్యం, ఆహార పదార్థాలు, కూరగాయలు పరిశీలించి, రిజిస్టర్ తనిఖీ, తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
ఉపాద్యాయులు, సిబ్బంది ఎంత మంది పని చేస్తున్నారు ఎందరు విద్యార్థులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. 6 వ తరగతి నుంచి ఇంటర్ దాకా 343 మంది విద్యార్థులు చదువుతున్నారని, టీచింగ్ స్టాఫ్ 14 మంది విధులు నిర్వర్తిస్తున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి జీసీడీఓ పద్మజ తీసుకెళ్లారు.

అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. విద్యార్థుల చదువు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యాలు పెంపొందించాలని ఉపాద్యాయులకు సూచించారు.

డీఈఓ రమేష్ కుమార్, తహసిల్దార్ మారుతి రెడ్డి, విద్యాలయం ఎస్ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు.