# Tags
#జగిత్యాల

తైబజార్ రద్దు చేయాలని రాయికల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి

రాయికల్ : S. Shyamsunder

పట్టణంలో రోడ్ల ప్రక్కన చిన్నచిన్న వ్యాపారులు కూరగాయలు, పండ్లు వివిధ రకాల వస్తువులను పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండనక, వాననక దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వ్యాపారులు జీవన సాగిస్తున్నారు.

తై బజార్ వీరిపై ఇబ్బందుల గురిచేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది.  జగిత్యాలలో తైబజార్ను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తై బజార్  తీసేయడం జరిగింది. అదే విధంగా రాయికల్ లో కూడా తై బజార్ రద్దు చేయాలని కమిషనర్ మనోహర్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ మాజీ సర్పంచ్ ఎద్దండి భూమారెడ్డి, నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ కొయ్యడి మహిపాల్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, బత్తిని భూమయ్య , షాకీర్, కడకుంట్ల నరేష్, బత్తిని నాగరాజ్, రాకేష్ నాయక్, బొమ్మ కంటే నవీన్ తదితరులు పాల్గొన్నారు