# Tags
#హైదరాబాద్ #తెలంగాణ

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించి, నాలుగు దశాబ్దాలుగా వాస్తవాలను వెలికితీస్తూ, సేవలందించిన రామోజీ రావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పత్రికారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన రామోజీరావు ప్రజల గొంతుకగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేశారు.రచయితగా, సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారని, దేశవ్యాప్తంగా ఈనాడు పేరున దశదిశలా చాటిన గొప్ప వ్యక్తి అని అన్నారు.రామోజీరావు కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.