# Tags
#తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులుగా శశి భూషణ్ కాచె పునర్నియామకం

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులు గా మంథని కి చెందిన న్యాయవాది, రైతు నాయకుడు శశి భూషణ్ కాచె, పునర్ నియామకం చేస్తున్నట్టు కమిషన్ సభ్య కార్యదర్శి వి.రాంచందర్ తేది 27-8-2024 రోజున లేఖ ద్వారా సమాచారం అందించారు.

15 మంది వివిద రంగాల నిపుణులతో సలహా కమిటీని పునర్ వ్యవస్థీకరింస్తూ తేది15-3-2024 రోజున తెలంగాణ రాజ పత్రం(అఫిసియల్ గెజెట్ నోటిఫికేషన్)విడుదలైనట్లు లేఖలో పేర్కొన్నారు.

గతంలో తేది:8-9-2023 విడుదలైన గెజెట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న తేదీ నుండి 3 సంవత్సరాల కాలానికి సలహ కమిటీ పునర్ వ్యవస్థీకర్ణ చేయడం జరిగింది.

రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య మంత్రి, విద్యుత్, ఇందన శాఖ నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క, పరిశ్రమల,ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆలోచన విధానాలను అమలు చేయడం, రైతులకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్( గృహ జ్యోతి)తో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలకై పనిచేస్తున్న తనను నియమించిన కమిషన్ వారికి శశి భూషణ్ కాచె కృతజ్ఞతలు తెలిపారు.