# Tags

ఓపెన్ జిమ్ లను మరమ్మతు చేయండి : మున్సిపల్ కమిషనర్ కు అనంతుల రమేష్ వినతి

ప్రజావాణి లో మున్సిపల్ కమీషనర్ కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ వినతి

  • కరీంనగర్ నగర పాలక సంస్థ పరిదిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లను మరమత్తు చేయాలని కోరుతూ, సోమవారం ప్రజావాణి లో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ సోమవారం ఒక వినతి పత్రం అందచేసారు.


ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ దా లేక నగరపాలక సంస్థ దా అని ప్రశ్నించారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల యుద్ధ ప్రాతిపాదికన 30 జిమ్ లు ఏర్పాటు చేసారని.. ఒక్కో ఓపెన్ జిమ్ కు 12 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు..

చలికాలం కావడంతో ఎక్కడ చూసినా ఓపెన్ జిమ్ లు కిటకిటలాడుతున్నాయని, వ్యాయామం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని… తీరా ఓపెన్ జిమ్ముల వద్ద పరికరాలు చెడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఓపెన్ జిమ్ లు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. పేర్కొన్నారు.. ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు నిర్వహణ విషయం తెలియజేసినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు..

ఓపెన్ జిమ్ లు గత పాలక వర్గం నగర ప్రజల ఆరోగ్యం కోసం పెట్టారా… కమిషన్ల కోసం పెట్టారా అర్థం కావడం లేదని పేర్కొన్నారు..