# Tags
#తెలంగాణ

తమను మాల మాదిగలతో కలపకుండా బేడ బుడగ జంగాల ఉపకులాలుగా చేర్చి 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని వినతి

త్వరలో కుల గణన నివేదిక రాబోతున్న సందర్భంగా…రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, జాన్ సెక్రెటరీ కళ్లెం ముత్తు కలిసి…తమను మాల మాదిగలతో కలపకుండా బేడ బుడగ జంగాల ఉపకులాలుగా చేర్చి 5 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా వారిని కోరడం జరిగింది.

అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న వానరాశి ఉప్పలయ్య కుమార్తె హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆమెకు నలుగురు ఆడపిల్లలు..తన భర్త చనిపోయాడు. ఐతే, ఇటీవల జరిగిన బదిలీలలో భూపాలపల్లి జిల్లాకు ఆమెను బదిలీ చేసినారు.

మంచిర్యాల నుండి భూపాలపల్లికి రావడం పోవడం దాదాపు 220 కిలోమీటర్లు కనుక ఆమె తన పిల్లలకు ఇబ్బంది అవుతుందని, ఆమెను తిరిగి మంచిర్యాల లేదా రామగుండం కమిషనరేటుకు బదిలీ చేయాల్సిందిగా మంత్రిని కోరడం జరిగింది.

ఈ రెండు విషయాలపైన మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించినందుకు వారికి బేడ బుడగ జంగం జన సంఘం తరఫున సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *