# Tags
#Science #అంతర్జాతీయం #ఎడ్యుకేషన్ & కెరీర్ #తెలంగాణ #హైదరాబాద్

పరిశోధన ఫలాలు – సమాజానికి జాతీయ సైన్స్ దినోత్సవం -2025

హైదరాబాద్ : (Reporter :ఎం. కనకయ్య )

By: BUNGA THIRUATHI
Research scholar
Osamani University., 99898 07071

విజ్ఞాన శాస్త్రం మన జీవితాల్లో వెలుగులు నింపే దివ్యమైన శక్తి. ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు సర్ సివి రామన్.

ఫిబ్రవరి 28 1928న రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భౌతిక శాస్త్రంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 1986 నుంచి జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

సి.వి.రామన్ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణతో 1930 లో నోబెల్ అంతర్జాతీయ అవార్డుని కూడా ప్రధానం చేయడం జరిగింది.
సివి రామన్ నవంబర్ 7, 1988లో తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో జన్మించారు.చిన్న తన్నం నుంచే విజ్ఞానశాస్త్రం పట్ల అపారమైన ఆసక్తిని కనబరిచారు.

రామన్ ఎఫెక్ట్ అంటే ఒక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు దాని తరంగధైర్ఘ్యంలో మార్పులు వస్తాయని ఆయన నిరూపించారు. ఈ ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచింది.

ఆ తరువాత ఆయన శాస్త్రీయ పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. భారతదేశంలో సివి రామన్ విజ్ఞాన శాస్త్ర పరిశోధనల విశేషంగా కృషి చేశారు.
ఆయన అడుగుజాడలలోనే దేశం అనేక రంగాలలో పరిశోధనల మరియు వాటి యొక్క ఫలాలు సమాజానికి అందించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు .

అభివృద్దిచెందుతున్న భారత దేశంలోని పరిశోధనా ఫలాలను అంతఃసాంకేతికత తెలియని పేద దేశాలకు సైతం శాస్త్ర ఫలాలు అందించడం ద్వారా ఆకలి, పేదరికం , అక్షరాస్యత రూపం పదంలో భారతదేశం ఉంది.

ప్రతి సంవత్సరం ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఒక నిర్దిష్ట అంశం (థీమ్) కొత్త ఆవిష్కరణ లేదా సాంకేతికత ఆధారంగా జరుపుకోవడం జరుగుతుంది.

దీని ఉద్దేశం ఏమిటంటే సైన్స్ పట్ల ప్రజలలో ఒక అవగాహన ప్రాముఖ్యతను తెలియజేయడం. జీవితంలో శాస్త్ర సాంకేతికతను విరివిగా ఉపయోగించడానికి గడిచిన సంవత్సరాలలో వివిధ నిర్దిష్ట అంశాల కు ప్రాముఖ్యతనిస్తూ జరుపుకున్నాము.

2025 నిర్దిష్ట అంశం( థీమ్ ) వికసిత్ భారత్ కు సైన్స్ మరియు ఆవిష్కరణలలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత అనే అంశం పై సమీక్ష జరుపుకోవడం జరుగుతుంది. నిర్దిష్ట అంశం ఒక కొత్త శకాన్ని సూచించడమే కాకుండా దేశీయంగా, అంతర్జాతీయంగా, ప్రజలు , శాస్త్రీయత వహించడానికి, కలిసి పనిచేయడానికి భారతదేశం మొత్తం దోహదపడే అవకాశాన్ని అందిస్తుంది. మొత్తం మానవాళి ప్రాముఖ్యత ఉన్న అంశాలను ప్రస్తావించాల్సిన అవసరాన్ని నిర్దిష్టంశం నొక్కి చెబుతోంది .

ఈ నేపథ్యంలో గత పది సంవత్సరాలలో భారత దేశంలో జరిగిన అభివృద్ధి ఆవిష్కరణలను యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని స్పష్టంగా చెప్పవచ్చు 81వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ పబ్లికేషన్ లో ప్రపంచవ్యాప్తంగా టాప్ ఐదు దేశాలలో ఒకటిగా, ఇన్నోవేషన్ ఇండెక్స్ 40వ స్థానంలో ఉంది, పేటెంట్ ఫైలింగ్ లో 90,000 దాటింది.

ఆస్ట్రాలమీ, విండ్ ఎనర్జీ సెమీ, కండక్టర్స్ క్లైమేట్ రీసెర్చ్ ,స్పేస్ రీసెర్చ్ ,బయోటెక్నాలజీ వంటి రంగాలలో సైన్స్ మరియు సాంకేతికత బలోపేతం ఇందుకు కారణం చంద్రుని వరకు భారతీయ ఆవిష్కరణలు చేరుకున్నాయి .చంద్రుడి దక్షిణ ధ్రువం పై విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. 

వ్యాక్సిన్ పరంగా కూడా భారతదేశం గుర్తింపు పొందింది కోవిడ్ మహమ్మారి సమయంలో నిరూపింపబడింది.ప్రజల జీవితాలను విలాసవంతంగా మార్చే శక్తి శాస్త్ర సాంకేతికత రంగానికి ఉంది అనడంలో ఇలాంటి సందేహం లేదు, ఇలాంటి ఆవిష్కరణలో మైలురాయి లాంటి మరికొన్ని ఆవిష్కరణల ఫలాలు ఇక్కడ ప్రస్తావించడం శుభ పరిణామమే అవుతుంది అందులో ముఖ్యంగా కొన్ని రంగాలు,

*వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు:*

సహాయపడేందుకు ఇచ్చేందుకు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడేందుకు నూతన ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడుతున్నాయి అందులో కొన్ని ముఖ్యమైనవి.   

*1. నానోయూరియా:* సాంప్రాధ్యాయ యూరియా కంటే తక్కువ పరిమాణంలో సమర్థవంతమైన నానా యూరియా ఉంటూ పర్యావరణహితంగా సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది. ముందు ముందు నానో డీఏపీ కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది మన సాంప్రదాయ డిఏపి కంటే మురుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. 

*2.డ్రోన్ టెక్నాలజీ:* పాంటల్ పర్యవేక్షణ మరియు ఎరువుల పంపిణీ వంటి పనుల కోసం డ్రోన్లను ఉపయోగించడం ద్వారా రైతులు సమయాన్ని శ్రమను ఆదా చేసుకుంటున్నారు ఇది పంట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు ఉత్పాదకతను పెంచడంలో సహాయకారిగా ఉంటున్నాయి. 

*3. మినీ కల్టివేటర్లులు:* ఈనాటి యువత తమ ఆలోచనలకు పదును పెట్టి రైతులకు ఉపయోగపడే మినీ కల్టివేటర్లు తయారు చేస్తున్నారు ఏటా మూడు కోట్ల విలువ చేసే 500 కు పైగా మినీ కల్టివేటర్లు తయారుచేసి దేశంలోని పరు రాష్ట్రాల రైతులకు అందిస్తున్నారు ఇలాంటి ఆవిష్కరణలు రైతులకు ఉపయోగపడేందుకు అదే విధంగా ఉత్పాదకతను పెంచేందుకు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నాయి.

*4. కిసాన్ సమచార కేంద్రాలు:* ఈరోజు వాతావరణ సూచనల ఉపగ్రహాలు ద్వారా తెలుసుకుంటూ తమ రోజువారి సమస్యలను పరిష్కరిచదం లో ఉపయోగపడుతుంది అందులో ఎరువులు,పురుగు మందులు  విత్తనాల పరీక్షా  సమాచారు ,వివిధ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రాలు రైతులకు ఉపయోగపడుతున్నాయి.

*వైద్య రంగంలో కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణలు:*

*1.ఎక్స్ రే ఆవిష్కరణ:* ఎక్సరే ఆవిష్కరణ వైద్య చరిత్ర

 లోనీ ఒక గొప్ప మలుపు ఉపయోగించి ఎన్నో అధునాతన కనుక్కోవడం జరిగింది ఎగ్సారే కిరణాలు శరీర అవయవాల నిర్మాణం పనితీరు రుగ్మతలు తెలుసుకోవడమే కాకుండా ముందుగానే క్యాన్సర్ లాంటి రోగాలను పసిగడుతుంది.

*2. పోర్టబుల్ డయాగ్నొస్టిక్ పరికరాలు:*

డయగ్నోస్టిక్ పరికరాలు పర్యవేక్షించగలిగే అధునాతన సూక్ష్మ ఇన్స్ట్రుమెంట్లు వేగంగా ఫలితాలను ఇవ్వగలుగుతున్నాయి.

*3. జినోమిక్స్ మరియు సీక్వెన్సీ సింగ్:*

జినోమిక్స్ డిఎన్ఏ సీక్వెన్సీ టెక్నాలజీ అనేక రోగాలను ముందే గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ సాంకేతికతను రోగాలకు సంబంధించి జీనో మీకు డాటా పరిశీలించి స్పందనలు అంచనా వేయడం ద్వారా వ్యక్తిగత వైద్యమునకు మార్గం సుగమం అవుతుంది.

*4. సెన్సార్ టెక్నాలజీ:*

సెన్సార్లు వైద్యరంగంలోఒక కొత్త విభాగంగా మారాయి .మానవ శరీరంలో జరిగే రసాయనిక మార్పులను, శరీర ఉష్ణోగ్రత, గ్లూకోజ్ స్థాయిలను రియాల్ఎల్ టైం లో పర్యవేక్షించవచ్చు. దీని ద్వారా డయాబెటిస్ డిసీజెస్ , ఆర్ట్ డిసీజెస్ వంటి పరిస్థితులపై ఈ సమయానికి చిట్కాలు సలహాలు అందిస్తుంది.

*5. బ్లడ్ టెస్ట్ లలో కొత్త ఆవిష్కరణ:*

ఇప్పటివరకు పరీక్షల కోసం అనేక గంటలు వేసి చూసేవారు కానీ ఇప్పుడు కొత్త రక్త పరీక్ష యంత్రాలు వేగంగా మరియు ఖచ్చితత్వంతో ఫలితాలు అందించడంలో అనేక పురోగతులు సాధించాయి వీటిని హెల్త్ క్యాంప్స్ ప్రాంతాలలో సులభంగా ఉపయోగించవచ్చు.

*6. సెల్ఫ్ డయాగ్నొస్టిక్ పరికరాలు:*

ఈ పరికరాలు వ్యక్తిగత స్థాయిలో స్వీయ నిర్ధారణ చేయడానికి అనుకూలంగా ఉంటాయి  . అందులో ముఖ్యంగా స్మార్ట్ వాచీలు ఫిట్నెస్ ట్రాకర్లు ఇప్పుడు మన శరీరంలో వివిధ అవయవాల పనితీరును పర్యవేక్షిస్తున్నాయి.

*7. మొబైల్ వైద్య పరికరాలు:*

ప్రస్తుతం మొబైల్ అప్లికేషన్లు మరియు డివైసులు ఆరోగ్య పరీక్షలలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి వాటి ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయడానికి వైద్యుల వద్దకు వెళ్లడం అవసరం లేదు నేరుగా ఇంట్లో నేనే పరీక్షలు చేసుకోవచ్చును.  

*8. కోవిడ్ 19 నూతన వ్యాక్సిన్ల ఆవిష్కరణ:*

కోవిడ్ 19 నియంత్రణకు అనేక వ్యాక్సిన్లు ఆవిష్కరించబడ్డాయి అందులో ముఖ్యంగా  భారత్ బయోటెక్,మోడర్నా, ఫేసర్ ఆస్ట్రాజినికా ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

వైద్య నిర్ధారణ యంత్రాల శాస్త్రీయ అభివృద్ధి, మరింత ఖచ్చితమైన సమయానికి వైద్య సేవలు అందించడంలో కీలకంగా మారింది. ఈ సాంకేతికతలు కేవలం మెరుగైన వైద్య సేవలు మాత్రమే కాదు అది ప్రజలకు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం కల్పిస్తుంది.

*ఉన్నత విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు:*

*1. ఆన్లైన్  పాఠాలు:* కోవిడ్-19 ఆన్లైన్ పాఠాలు పద్ధతులలో  కొత్త అధ్యాయానాన్ని ప్రారంభించాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎప్పుడైనా నేర్చుకునే అవకాశం సృష్టించింది.

*2. వర్చువల్  రియాలిటీ(VR), అగ్మెన్టెడ్ రియాలిటీ(AR):* విద్యార్థులకు వాస్తవిక అనుభవాలు  ఇవ్వడం భౌతిక శాస్త్రం, జీవశాస్త్ర  వంటి ు విషయాలు మరింత సమర్థవంతంగా నేర్పడం.

*3. బిగ్ డాటా మరియు అనలెటిక్స్:* విద్యార్థుల పనితీరు అభిరుచుల పాఠాలు ప్రాధాన్యతలను గమనించి వారికి తగిన ఆప్షన్స్ సలహాలు ఇవ్వడం వంటివి.

*4. వ్యక్తిగత బోధన:* ప్రతి విద్యార్థి యొక్క స్వంత శైలి వేగం మరియు అభిరుచులకు అనుగుణంగా అభ్యసనం సాగించడం.

*5. గ్లోబల్ నెట్వర్క్:*  వివిధ దేశాల విద్యా వ్యవస్థలను అవగతం చేసుకొని,  వారి శాస్త్రీయ అభివృద్ధి మరియు సాంకేతికతను మనం ఉపయోగించుకోవడం ఇంకా ఇంటరాక్టింగ్ మరియు కష్టమైసేడ్ లెర్నింగ్ , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నీ వాడుతున్నారు.

*సేవల రంగంలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు:*

సేవల రంగంలో శాస్త్రీయ మార్పులు మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక కార్యకలాపాల పరిమితిని  దాటించి, మరింత సమర్థవంతమైన సేవలను అందించడానికి ప్రజలకు మెరుగైన అనుభవాలు అందించడానికి అదేవిధంగా పరిసరాలను కాపాడుకోవడానికి కీలకంగా మారింది.

*1. ఆటోమేషన్:* రొబాటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తున్న సేవా రంగాలు ఎక్కువ ఖర్చులు తగ్గించుకుంటూ గుణాత్మకతను పెంపొందించుకుంటున్నాయి.

*2. డేటా అనేలాటిక్స్:* మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి పెద్ద మొత్తంలో డేటా విశ్లేషణ శాస్త్రాన్ని ఉపయోగించడం.

*3.బ్లాక్ చైన్:* లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఆరోగ్యము మరియు విద్యా రంగాల్లో భద్రతా మార్పులు మరియు ట్రాన్సాక్షన్ల పారదర్శకత కు ఉపయోగపడుతుంది.

*4. ఆరోగ్య  సేవలు:* టెలి మెడిసిన్ ,డిజిటల్ ఆరోగ్య రికార్డు, రోబోటిక్స్, వంటి పరిష్కార మార్గాలు.

*5. సాఫ్ట్వేర్ సేవలు:* ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ సేవలు. 

అంతరిక్ష రంగంలోనూతన ఆవిష్కరణలు:

*1. మార్స్ మిషిన్లు:* ఇస్రో యొక్క మంగళయాన్ మిషన మరియు   నాసా యొక్క  పర్సీవరన్స్ రోవర్లు అంగారక గ్రహంపై పరిశోధనలను నిర్వహిస్తున్నాయి .

*2.  అంతరిక్ష పర్యాటకం:* ప్రైవేట్ సంస్థలు అయినటువంటి స్పేస్ ఏఈక్స్, బ్లూ ఆరిజిన్ మరియు వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు అంతరిక్ష ప్రయాణాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో శాస్త్ర *సాంకేతిక ఆవిష్కరణలు:*

పెరుగుతున్నకాలుష్యం ,వాతావరణ మార్పులు, సహజ   వనరుల  క్షీణత వంటి సమస్యలు మన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.  నేపథ్యంలో  శాస్త్రవేత్తలు పర్యావరణ పరిరక్షణ కోసం  నిరంతరం నూత న ఆవిష్కరణలకై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .

*1. కార్బన్   క్యాప్చర్ మరియు స్టోరేజ్ (CCS):* వాతావరణం లో విడుదల అయ్యే కార్బన్డయాక్సైడ్ ను సంగ్రహించి భూమిలో భద్రపరచడం ఈ సాంకేతికత యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియ  ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించి వాతావరణ మార్పులను నియంత్రించవచ్చు. 

*2. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్:* ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారింది శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి కొత్త పద్ధతులు అభివృద్ధి చేస్తున్నార.ు కొన్ని పరిశోధనలు ప్లాస్టిక్ ను జీవ ఇంధనాలుగా మార్చే ప్రక్రియలను కూడా కనుగొన్నాయి .ఎంజాయ్ ఆధారిత ప్లాస్టిక్ విచ్చిన్నం కూడా అభివృద్ధి చెందుతుంది. 

*3. పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు:* జల ,సౌర, పవన విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరులు వినియోగం పెరుగుతుంది.   సౌర పలకల  సామర్ధ్యాన్ని పెంచడం, పవన టర్బైండ్ల రూపకల్పనలో మెరుగుదలలు , సముద్ర తరంగాల నుండి విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక ఆవిష్కరణలు వస్తున్నాయి. పెరౌస్కిట్ సౌర ఫలకాలు మరియు ఫ్లోటింగ్ సోలార్ ఫామ్స్ వంటి కొత్త సాంకేతికతలు మరింత ఎక్కువ శక్తి ఉత్పత్తిని అందిస్తున్నాయి.

*4.  జీవవైవిద్య  పరిరక్షణ :* జీవవైవిద్యం సంరక్షించకపోతే పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఇందులో భాగంగా అంతరించిపోతున్న వృక్ష, జంతు జాతులను కాపాడడానికి కొత్త పద్ధతులను అభివృద్ధి చేస్తున్నార. జీన్ ఎడిటింగ్, క్లోనింగ్ వంటి నూతన సాంకేతికతలు ఉపయోగపడుతున్నాయి. పర్యావరణ డిఎన్ఏ సాంకేతికత(EDNA) ద్వారా నీటిలో మరియు నేలలో ఉన్న జీవుల డిఎన్ఏ ను గుర్తించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

*5. స్మార్ట్ వ్యవసాయం:* స్మార్ట్ వ్యవసాయం ద్వారా తక్కువ నీటితో పంటలు పండించడం, ఎరువుల వాడకాన్ని తగ్గించడం అదేవిధంగా పంట దిగుబడి పెంచడం సాధ్యమవుతుంది. ఇంకా ఇందులో సెన్సార, డ్రోన, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలు పడుతున్నాయి. వర్టికల్ ఫార్మింగ్ మరియు హైడ్రోపోనిక్స్ వంటి ఈ పద్ధతులు తక్కువ స్థలంలో ఎక్కువ పంటను పండించడానికి సహాయపడుతున్నాయి. 

*రవాణా రంగంలో ఆధునిక ఆవిష్కరణలు:* నేటి ఆధునిక 

యుగంలో రవాణా అనేది జీవితంలో ఒక ముఖ్య భూమిక ను  పోషిస్తుంది. వేగవంతమైన, సురక్షిత మైన అదేవిధంగా పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రవాణాలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఇవి మన ప్రయాణ  విధానాన్ని  మార్చి వేస్తున్నాయి. 

*1. ఎలక్ట్రిక్ వాహనాలు :* పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఎంతో  కీలకంగా మారాయి. బ్యాటరీ టెక్నాలజీలో పురోగతి, చార్జింగ్ స్టేషన్ల విస్తరణ తో ఈ వాహనాల వినియోగం పెరుగుతుంది. ప్యానెల్స్ ద్వారా ద్వారా చార్జింగ్ సౌకర్యం, వైర్లెస్ చార్జింగ్ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి.

*2. స్వయం చోదక వాహనాలు :* డ్రైవర్ లేని వాహనాలు  రవాణా రంగంలో పెద్ద మార్పులు తెస్తున్నాయి. రోబో టాక్సీలు మరియు స్వయం చోదక ట్రక్కులు వంటివి రానున్న కాలంలో విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. 

*3. హైపర్ లూప్:* హైపర్ లూప్ అనేది   గాలిలేని ట్యూబులలో అధిక వేగంతో ప్రయాణించే వాహనం.ఇది గంటకు 1000 km కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలదు ఇది విమాన ప్రయాణానికి పోటీని ఇస్తుంది ఈ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. 

*4. డ్రోన్ డెలివరీ మరియు ఏరో టాక్సీలు:* మందులు, ఆహారం అత్యవసర సమయాలలో మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఏరో టాక్సీలు నిలువుగా పైకి లేచి నిలువుగా దిగుతాయి కావున వీటికి రన్వే ప్రత్యేకంగా అవసరం లేదు.

*కృత్రిమ మేధస్సు వివిధ రంగాలలో శాస్త్రీయ ఆవిష్కరణలు:*

నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం  శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు( AI )ముఖ్యపాత్ర పోషిస్తుంది.కృత్రిమ మేధస్సు అనేది కంప్యూటర,  యంత్రాలు మానవుల వలె ఆలోచించి, నేర్చుకొని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉండే ఒక సాంకేతికత. ఇది వివిధ రంగాలలో అనేక శాస్త్రీయ ఆవిష్కరణలకు దారితీసింది.

1. వైద్యరంగం- కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థలు వైద్య  చిత్రాలు( ఎక్స్ రేలు,ుసిటీ స్కాన,ఎమ్మారై )లను విశ్లేషించి కచ్చితంగా గుర్తించగలవు.  క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. కొత్త ఔషధాలను కనుగొనడానికి వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 

*2. వ్యక్తీకరించిన వైద్యం:* కృత్రిమ మేధస్సు రోగుల వ్యక్తిగత డేటాను  విశ్లేషించి తగిన చికిత్సలను సూచిస్తుంది.

*3. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు:* పంటల పర్యవేక్షణ, సెన్సార్లు , నేల స్వభావమ ,ఎరువులు ు నీటి వినియోగంలో ఉపయోగపడుతుంది. ఇంకా తయారీ రంగ ం భద్రత, వినోదం  ఆర్థికం వంటి రంగాలలో   కూడా ఉపయోగపడుతుంది. కృత్రిమ మేధస్సు అనేది మన జీవితాలను మార్చగల శక్తివంతమైన సాంకేతికత, ఇది వివిధ రంగాలలో శాస్త్రీయ ఆవిష్కరణలకు దారితీసింది కృత్రిమ మేధస్సు పూర్తిగా ఉపయోగించడం ద్వారా మనం మరింత మెరుగైన భవిష్యత్తు నిర్మించవచ్చు. 

 సైన్స్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ,ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి అదేవిధంగా కొత్త ఆవిష్కరణలు చేయడానికి సహాయపడుతుంది.

 జాతీయ సైన్స్ దినోత్సవం అనేది కేవలం ఒకరోజు కాదు, ఇది శాస్త్ర విజ్ఞానం పట్ల మనకున్న నిబద్ధతకు ప్రతీక. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో  మరింత అభివృద్ధి సాధించడానికి, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ఈ దినోత్సవం స్ఫూర్తినిస్తుంది. సర్ సివి రామన్ మహనీయుల యొక్క ఆదర్శాలను అనుసరిస్తూ, శాస్త్రీయ పరిశోధనలకు తోడ్పడదాం. భవిష్యత్ తరాలకు శాస్త్ర విజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను్ తెలియజేస్తూ వారిలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తూ  నవభారత నిర్మాణానికి కృషి చేద్దాం .

    2. వ్యక్తీకరించిన వైద్యం: కృత్రిమ మేధస్సు రోగుల వ్యక్తిగత డేటాను విశ్లేషించి తగిన చికిత్సలను సూచిస్తుంది.
    3. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు: పంటల పర్యవేక్షణ, సెన్సార్లు , నేల స్వభావమ ,ఎరువులు ు నీటి వినియోగంలో ఉపయోగపడుతుంది. ఇంకా తయారీ రంగ ం భద్రత, వినోదం ఆర్థికం వంటి రంగాలలో కూడా ఉపయోగపడుతుంది. కృత్రిమ మేధస్సు అనేది మన జీవితాలను మార్చగల శక్తివంతమైన సాంకేతికత, ఇది వివిధ రంగాలలో శాస్త్రీయ ఆవిష్కరణలకు దారితీసింది కృత్రిమ మేధస్సు పూర్తిగా ఉపయోగించడం ద్వారా మనం మరింత మెరుగైన భవిష్యత్తు నిర్మించవచ్చు.