# Tags
#తెలంగాణ

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకo : వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకo : వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల :

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు.

పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.  అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకొని 10/10 సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి సన్మానించారని గుర్తు చేశారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల ప్రమోషన్స్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్ర్తవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్ లు స్వీకరించిన వారిని సన్మానించి, అభినందనలు తెలిపారు.