# Tags

తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ :

తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూ
సావిత్రి బాయి పూలే కు ఈనాటి మన భారతదేశ ప్రజలు రుణపడి ఉన్నారని,ఆనాడు మహిళల పట్ల సమాజం యొక్క కట్టుబాట్లు,అణిచివేత,నిరక్షరాస్యత,అసమానతలకు వ్యతిరేకంగా తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో సామాజిక ఉద్యమం చేసిన ధీరవనిత, బాలికల విద్యకొరకు భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి అన్నారు.


ఉపాధ్యాయురాలిగానే కాకుండా,రచయిత్రిగా,సంఘ సంస్కర్తగా పనిచేస్తూ ప్లేగువ్యాది సోకిన వారికి సామాజిక సేవచేస్తూ, అదే వ్యాదితో మరణించడం జరిగిందన్నారు.

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు ఘన నివాళులు అర్పించారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి,పి.రవీందర్,ఇ. శ్రీధర్,కె.రాజేందర్, కె.హారిష్,ఎస్
నరేష్,జె.రాజేశం, విద్యార్థులు పాల్గొన్నారు.