# Tags

కిసాన్ గ్రామీణ మేళాకు తరలిన శివాజీ రైతు గోనెరెడ్డి రాయికల్ సంఘ రైతులు

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ :

జాతీయ కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన “కిసాన్ గ్రామీణ మేళాకు” శివాజీ రైతు గోనెరెడ్డి సంఘం రాయికల్ కి చెందిన 20 మంది రైతులు హాజరైనారు.

ఈ మేళాలో రైతుబాగుకై ,పల్లె ప్రగతికై , రైతు ఆదాయ పెంపుకై,
కొత్త కొత్త సాంకేతిక విషయాలపై ఈ మేళాలో రైతులకు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తులు, మరియు పనిముట్ల, విత్తనాల కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా రైతులకు కొన్ని కంపెనీల విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, మరియు ఇతర వస్తువులను తక్కువ ధరలకే అందజేశారు.

ఈ సందర్భంగా శివాజి రైతు సంఘం సభ్యులు
ఈ కార్యక్రమ నిర్వహాకులు జాతీయ కిసాన్ సంఘ్ జాతీయ నాయకులు పొలసాని సుగుణకర్ రావు ను సన్మానించారు.


ఈ కార్యక్రమంలో కెడిసిసి మాజీ డైరెక్టర్ పడిగెల రవీందర్ రెడ్డి ,పాతూరి రమాపతి రెడ్డి, మోటకాడి మోహన్ రెడ్డి, కుర్మ మల్లారెడ్డి ,కుంబాల శ్రీనివాస్ రెడ్డి, కడపటి రాజేందర్ రెడ్డి, పాతూరి జలపతి రెడ్డి ,జిల్లాల గంగారెడ్డి ,జిల్లాల సుధాకర్ రెడ్డి ,జిల్లాల సతీష్ రెడ్డి, పడిగెల కిషోర్ రెడ్డి, లక్కాడి శ్రీనివాస్ రెడ్డి ,పటేల్ గంగారెడ్డి, కడపటి మోహన్ రెడ్డి ,తురగ నవీన్ రెడ్డి, కుర్మ సుదర్శన్ రెడ్డి లు పాల్గొన్నారు.