తెలంగాణ డీజీపీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్న శివధర్ రెడ్డి.

1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి – నేపథ్యం
హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందినవాడు.
ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్న శివధర్ రెడ్డి.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా practise చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశం.
ASP గా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేసిన శివధర్ రెడ్డి.

గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలు.
జిల్లాల SP గా, DIG SIB గా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించిన శివధర్ రెడ్డి.
2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన శివధర్ రెడ్డి.
2016 నయీం ఎన్ కౌంటర్ ఆపరేషన్ ను plan చేసిన శివధర్ రెడ్డి.
ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావో లో కూడ పని చేసిన శివధర్ రెడ్డి.
నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించిన శివధర్ రెడ్డి.
2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి గా శివధర్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం.
అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన శివధర్ రెడ్డి.
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం Arrive Alive క్యాంపెయిన్ నిర్వహణ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా పనిచేసిన శివధర్ రెడ్డి.
పర్సనల్ వింగ్ లో ఐజి, అడిషనల్ డీజీ పని చేసిన శివధర్ రెడ్డి
అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గాను అనుభవం.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామకం
ఆగస్టు 2024 లో డీజీపీగా ప్రమోషన్.
గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్న శివధర్ రెడ్డి.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





