# Tags
#తెలంగాణ

మహిళా సాధికారతపై అవగాహన కలిగి ఉండాలి

రాయికల్ : S.శ్యామసుందర్

మహిళలు మహిళా సాధికారత,మిషన్ శక్తి స్కీం, మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలు అందించే సేవలపై అవగాహన కలిగి ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తబస్సమ్, మహిళా సాధికారత కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు.

మంగళవారం రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ఆశా దినోత్సవాన్ని పురస్కరించుకొని “బేటి బచావో… బేటి పడావో పథకం” గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీసి, పిఎన్డీటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆక్ట్ గురించి అవగాహన కల్పించారు. మిషన్ శక్తి స్కీం, మహిళా సాధికారత, మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ అందించే సేవలు,సఖీ కేంద్రం, చైల్డ్ హెల్ప్ లైన్, లింగ నిర్ధారణ నిషేధ చట్టాల గురించి తెలిపారు. ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్ర బృందం బి. స్వప్న,కే.గౌతమి, జెండర్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.