# Tags
#తెలంగాణ

శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూ. కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్

ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్

-ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాసుగంటి కుటుంబం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి జస్టిస్ పుల్ల కార్తిక్ నగదు పురస్కారాలను ప్రకటించిన కాసుగంటి  లక్ష్మణ్ కుమార్ 

ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను కోరారు.

సోమవారం శ్రీ కాసుగంటి నారాయణరావు (SKNR) బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపాల్ డా. దాసరి నాగభూషణం ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన పేరిట జరిగిన కార్యక్రమంలో కాసుగంటి లక్ష్మణ్ కుమార్ తో పాటు శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. అశోక్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం సాయి మధుకర్, లెఫ్టినెంట్ రాజు, గోవర్ధన్ తో పాటుగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు, జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు పలువురు జూనియర్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన sknr ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ మరియు ఆర్ట్స్ విద్యార్థులకు కాసుగంటి కుటుంబం తరఫున మరియు కళాశాల పూర్వ విద్యార్ధి, జస్టిస్ పుల్లా కార్తీక్ ప్రకటించిన మేరకు విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందిస్తామని కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు.

అలాగే విద్యార్థులు చదివిన చదువుకు సార్థకత ఏర్పరచుకోవడానికి ఎస్ కే ఎన్ ఆర్ కళాశాలను వేదికగా చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని, విద్యారంగంతో పాటు సామాజిక కార్యక్రమంలో సైతం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

అలాగే విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో విద్యను అభ్యసిస్తే సాధించనిదంటూ ఏదీ లేదని కాసుగంటి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

అంతేకాకుండా తమ తాతగారైన కాసుగంటి నారాయణరావు విద్యారంగం అభివృద్ధి కోసం దానం చేసిన జూనియర్, డిగ్రీ కళాశాలల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులపై కూడా ఉందని అన్నారు.ఇక ఇంటర్ తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవాలని ప్రైవేటు వైపు మొగ్గు చూపరాదనీ  ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఈ సందర్భంగా శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నగదు పురస్కారాలు ప్రకటించడం పట్ల కళాశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రిన్సిపల్ దాసరి నాగభూషణం అన్నారు.