# Tags
#తెలంగాణ

జిల్లాలో నిషేధిత గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా….

జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి 43 లీటర్ల జాగిరి నేలమట్టం చేయడం జరిగింది.18 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని,12 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని, అది తయారు చేసే విధానం నిబంధనలకు పూర్తి విరుద్ధమని అందులో ఆరోగ్యానికి హాని చేసే యూరియా, మురికి నీరు పటిక బెల్లం వాడడం వలన ఆరోగ్యానికి విపరీతమైన హాని చేస్తుందని , తాగే వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు.కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం పాలసీకి వ్యతిరేకంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో రహస్యంగా ఇండ్ల వద్ద,పంట పొలాల వద్ద,అటవీ ప్రాంతంలలో కలుషిత నాటుసారా తయారు చేస్తూ విచ్చలవిడిగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారనీ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని త్వరలో వారిని కూడా పట్టుకొని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.