# Tags
#ఎడ్యుకేషన్ & కెరీర్ #తెలంగాణ

పేరులో సిరి, కాంతులు, కానీ, జీవితంలో ఎదిగేంతవరకు పేదరికం  – చీకట్లు….

పేరులో సిరి, కాంతులు, కానీ, జీవితంలో ఎదిగేంతవరకు పేదరికం  – చీకట్లు….

* కాంతిరేఖలైన ప్రధానోపాధ్యాయుడు, ఆచార్యులు, పూర్వ విద్యార్థులు, ఇంకా ఎందరో….

పేరులో సిరి, కాంతులు, కానీ, జీవితంలో ఎదిగేంతవరకు పేదరికం  – చీకట్లు … కానీ, పేదరికం, చీకట్ల నుండి బయటకు రావడానికి, ఎక్కడో చిన్న కాంతిరేఖలు, పేదరికంనుండి బయటకు రావడానికి సాయం అందిస్తాయి… వెలుగులు నింపడానికి, సిరిని అందించడానికి తోడ్పడతాయి..

ఆ కాంతిరేఖలను సక్రమంగా వినియోగించుకున్నపుడే అవన్నీ సాధ్యమవుతాయి కదా! అందుకే ఆ కాంతిరేఖలను సద్వినియోగం చేసుకుని… వచ్చిన, అందించిన కొద్దిపాటి వెలుగును కొండంత చేసుకుని, సిరిని, కాంతులను అందుకున్న విద్యార్థియే దన్గర్వాడి, కరీంనగర్ పాఠశాల విద్యార్ధి “శ్రీకాంత్”.

ఆ కాంతిరేఖలు… నేటి మంత్రి, దన్గర్వాడి, కరీంనగర్ పాఠశాల విద్యార్ధి పొన్నం ప్రభాకర్ తో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలికోట తిరుమల్ మరియు ఉపాధ్యాయ బృందం ఎం. డి. జావిద్, శ్రీమతి సుధారాణి, శ్రీమతి శోభారాణి, శ్రీమతి విజయలక్ష్మి గారు, గోవింద రావు మున్నగు ఉపాధ్యాయులు. వీరేకాకుండా,పాఠశాల పూర్వ విద్యార్థి మధు,చింధం అశోక్, సర్పంచ్ మురళి, పోల్సాని రవీందర్ రావు, Vమహేందర్ రావు తోపాటుగా ఇంకా ఎందరో వ్యక్తులు శ్రీకాంత్ ఎదుగుదలకు తోడ్పడ్డారు… కాంతిరేఖలయ్యారు. 

ఇక అసలు విషయానికొస్తే,…  శ్రీకాంత్ జీవితం cheekati-velugula జీవితం… కమాన్పూర్ బద్దిపల్లి  కరీంనగర్ దగ్గర.. శ్రీకాంత్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వీరు ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లె.. కమాన్పూర్ లో చిన్న గుడిసె, దాని ముందు ఒకచిన్న కమ్మరి పాత సైకిల్ రీమ్ కొలిమి.. ఇంట్లో కరెంటు లేదు, అయినా దీపం చాటున కైనీడలో చదువులు కొనసాగించిన వైనం.. శ్రీకాంత్ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత…కరీంనగర్ ధన్గర్ వాడి కరీంనగర్ పాఠశాలలో 8th లో చేరి చదువులో మంచి మార్కులతోclass first ఉండేవాడు.. 

కానీ మధ్యాహ్నం అందరి విద్యార్థులతో లంచ్ బాక్స్ లేకుండా అటు ఇటు తిరుగుతూ మళ్లీ తరగతి ప్రారంభ సమయంలో తరగతి గదిలో వెళ్లి యధావిధిగా పాఠాలు వినేవాడు.. 

ఈ విషయాన్ని గమనించిన పాఠశాల మహిళా ఉపాధ్యాయ బృందం బిస్కెట్ ప్యాకెట్స్, చిన్న చిన్న స్నాక్స్, అప్పుడప్పుడు వారు తెచ్చుకున్న లంచ్ బాక్సులు అందించేవారు.. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు కలికోట తిరుమల్ కు  ఉపాధ్యాయ బృందం తెలియ చేసేనప్పుడు, ఆయన వెంటనే, హాస్టల్ నడుపుతున్న పాఠశాల పూర్వ విద్యార్థి  మధును సంప్రదించి, శ్రీకాంత్ ను అక్కడ  చేర్పించారు…

ఇక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆ విద్యార్థి పట్ల చక్కటి శ్రద్ధతో, అపారమైన ప్రేమతో చూసుకుంటూ ఒక కన్న కొడుకు లాగా సెలవులలో వారింట్లో కూడా భోజనం ఏర్పాటు చేసేవారు.. 

పదవ తరగతి చదువుతున్న సమయంలోరాత్రి స్టడీ అవర్స్ లో విద్యార్థుల ఇంటి వద్ద పర్యవేక్షిస్తున్న సమయంలో శ్రీకాంత్ ఇంట్లో కరెంటు లేక దీపం కింద చదువుతున్నటువంటి విషయాన్ని హింది పండిత్ ఎం డి జావిద్ ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే..2007లో అప్పటి సర్పంచ్ మురళిని సంప్రదించడంతో, చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న HOUSE TAX BILL Clear చేయడం వల్ల కరెంటు మీటర్ ను  ఏర్పాటు చేయడం  జరిగింది..

శ్రీకాంత్ పాఠశాల ssc లో అత్యుత్తమ school first మార్కులు సంపాదించిన క్రమంలో తను ఇంజనీర్ కావాలన్న ఆకాంక్షతో.. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి, పూర్వ విద్యార్ధి పొన్నం ప్రభాకర్.. ఆ రోజుల్లో రాష్ట్ర NSUI ప్రెసిడెంట్ గా రూ.10,000/ నగదుగా ఇచ్చిTRINITY COLLEGE లో తాను ప్రత్యేక చొరవతో కరీంనగర్ నందు ఇంటర్మీడియట్ లో చేర్పించారు. ఇంటర్ పూర్తి చేయడంలో పాఠశాల  ఉపాధ్యాయ బృందం పూర్తిస్థాయిలో 2 సంవత్సరంలకు సరి పడే హాస్టల్ కిట్, బుక్స్, డ్రెస్సెస్, సమకొర్రచడం జరిగింది. ఇంటర్మీడియట్ మంచి మార్కు లతో పాస్ అవడమే కాకుండా ఇంజనీరింగ్ లో  seat సంపాదించాడు.శ్రీకాంత్ ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి పాఠశాల పూర్వ విద్యార్థి చింధం అశోక్ (singapoor soft ware) ముందుకొచ్చి ఫీజులు మరియు మెయింటెనెన్స్ చార్జెస్ పూర్తిస్థాయిలో పంపించడంతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు… 

అలాగే…M టెక్ కూడా  పలువురు పెద్దల  సహాయంతో పీజీ పట్టా పొంది ప్రభుత్వ ఉద్యోగమే పొందాలనుకున్న తపనతో హైదరాబాదులో తాను ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్యూషన్ చెప్తూ, వస్తున్న డబ్బులతో.. AEE JOB కోసం కోచింగ్ తీసుకుని ఇటీవలే AEE గా ఉద్యోగం సంపాదించాడు.. 

కాగా, శ్రీకాంత్ ఉద్యోగం, ఇంటర్వ్యూ సమయంలో  JNTU KONDAGATTU COLLEGE లో  FEE Rs 35,000/ పెండింగ్లో ఉండడంతో సర్టిఫికెట్స్ రిలీజ్ కోసం ప్రధానోపాధ్యాయుడు తిరుమల్  ఈ విషయం తన  పూర్వ విద్యార్థి పోల్సాని రవీందర్ రావు (హైదరాబాద్), మరియు వి.మహేందర్ రావు (గ్రానైట్ కాంట్రాక్టర్ hyd) నాటి పూర్వ విద్యార్థులు (alumini ) చెల్లించి ఉద్యోగం పొందడంలో శ్రీకాంత్ కు సహకరించారు.. దీంతో, నాటి పేదరికం, చీకట్లనుండి బయటపడి, తన జీవితంలో వెలుగులు నింపిన కాంతిరేఖలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ…. చదువే కాకుండా, ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి సహకరించిన ఆచార్య బృందానికి, పూర్వ విద్యార్థులకు, నేటి మంత్రికి మరియు మార్గానిర్దేశం చేసిన ప్రధానోపాధ్యాయుడికి పాడాభివందనాలంటున్న ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ నేటి యువతకు ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం…  

ఇక మరి గురు దక్షిణగా, ఉద్యోగంలో చేరి, మొట్ట మొదటి వేతనం పొందగానే, కృతజ్ఞతాభావంగా… ధన్గర్ వాడి పాఠశాల విద్యార్థులకు examination pads, pens, pencils, etc kit ను వర్గల్ శ్రీ సరస్వతి మాత సన్నిధి లో చాకుంట పాఠశాల విద్యార్థులకు అందించి, ఆచార్యాదేవోభవ అంటూ, కాంతిరేఖల మార్గదర్శనం తో ముందుకుసాగుతున్న శ్రీకాంత్ కు అల్ ద బెస్ట్…

శ్రీకాంత్ లాంటి విద్యార్థులకు ప్రోత్సాహమందించిన, ఇంకా అందిస్తున్న నాటి ఆచార్యులకు, పూర్వ విద్యార్థులకు, ప్రధానోపాధ్యాడు తిరుమల్ కు, నేటి మంత్రి పొన్నం ప్రభాకర్ కు “తెలంగాణ రిపోర్టర్” శతదాసహస్ర వందనాలతో….