# Tags

సామాజిక సేవకుడు బండ శంకర్ కు పంజాబ్ గవర్నర్ చేతులమీదుగాఇంటర్నేషనల్ బుద్ది పీస్ అవార్డు

సేవల్లో కొండ.. అవార్డులకు కేరాఫ్ బండ :

పంజాబ్ గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న బండ శంకర్

జగిత్యాల :

సేవే లక్ష్యం – ప్రేమే మార్గం అనే నానుడిని నిజం చేస్తూ సేవ రంగంలో ముందుకు సాగుతున్న బండ శంకర్ కు మరో అరుదైన అవార్డు దక్కింది. పంజాబ్ లోని చంఢీఘడ్ లో గల రాడిషన్ హోటల్ లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా మైత్రి పీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు పంపిణి కార్యక్రమం లో ఇంటర్నేషనల్ బుద్ధ పీస్ అవార్డు ను అందుకున్నారు.

సామజిక సేవకు మారు పేరుగా, ఆపదలో ఉన్న దయార్థులకు ఆపద్భాంధవుడిగా పేరు గాంచిన ప్రముఖ సామాజిక సేవకుడు, టిఫిసిసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్ కు అత్యున్నత పురస్కారం తో అరుదైన గౌరవం దక్కింది.

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బండ శంకర్ సామజిక సేవలో గత కొన్నేళ్లుగా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందరి చేత ప్రశంసలు పొందారు. జనని స్వచ్చంద సేవ సంస్థ ను స్థాపించిన అయన ప్రమాదాల బారిన పడిన నిస్సహాయులకు అవసరమైన రక్తదానం చేపించడంలో అందరికన్నా ముందు వరుసలో నిలిచారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఊరు, పేరు, గుర్తింపు లేకుండా మృతి చెందిన ఎందరో అనాధ శవాలకు పెద్ద కొడుకయ్యి దహన సంస్కారాలు నిర్వహించి తన ఔధర్యం ను చాటుకున్నారు. భిక్షాటన చేస్తూ అపరిశుభ్రంగా ఉంటూ, అనారోగ్యం కు గురైనా ఎందరో వృద్ధులను చేరదీసి, స్నానం చేయించి, క్షవరం తీయించి, కొత్త బట్టలు అందించి, వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఓల్డ్ ఏజ్ హోమ్, కేర్ సెంటర్ లకు తరలిస్తూ వారికి అపద్భాంధవుడిగా నిలిచారు.

తను చేసిన సేవలకు గుర్తింపుగా వర్మ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, గత ప్రభుత్వంలో రక్తదాతగా, సామజిక సేవకునిగా జిల్లా స్థాయిలో ఎంపికైన బండ శంకర్ అవార్డు తో పాటు రివార్డు సైతం అందుకున్నారు.

గానకోకిల కళానీకెతన్ సేవా రత్న, దళిత సంఘాల తరుపున దళిత రత్న లాంటి అనేక అవార్డులు అందుకున్నారు. ఈ సందర్బంగా సామాజిక సేవకుడు, టిపిసిసి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్ కు అవార్డు రావడం పట్ల పలువురు అయన మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, పుర ప్రముఖులు తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.

ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ… తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషకారంగా ఉందని, ఇది తన బాధ్యతను మరింతగా పెంచిందని భావిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. తనకు అభినందనలు తెలిపిన వారికి ప్రత్యేకంగా, పేరు పేరునా అవార్డ్ గ్రహీత బండ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

శుభాకాంక్షలు

మైత్రి పీస్ ఫౌండేషన్ వారి ఇంటర్నేషనల్ బుద్ధ పీస్ అవార్డు ను అందుకున్న మిత్రుడు బండ శంకర్ కు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీసభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణరిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు