# Tags

గత 10 నెలల్లో 103 కేసుల్లో 124 మందికి జైలు శిక్షలు..పిపి లను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్

నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

  • నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ అశోక్ కుమార్

కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోర్టు కేసులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షల పడేలా కృషి చేసిన పీపీ లను శుక్రవారం అభినందించి శాలువలతో సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమన్నారు.

పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయoతో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా పని చేయటం అభినందనీయమని అన్నారు.

పోలీస్ అదికారులు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.

పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు ఖచ్చితంగా జమ చేయాలన్నారు.

గడిచిన పది నెలల్లో 103 కేసుల్లో నిందితులుగా ఉన్న 124 మందికి జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు.

ఇందులో 21 మంది నిoదితులకు జీవిత జీవిత ఖైదు, 6గురు నిoదితులకు 20 సంవత్సరాల జైలు శిక్ష, 6గురు నిoదితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష లు విధించడం జరిగింది.

ఆయా కేసుల్లో నిందితులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పీపీలు

1.J.Mallkikarjun PP PDJ Court, Jagtial

2.K.Mallesham, Addl. P.P.I ADJ COURT Jagtial

3..Ch.Ramakrishna Rao Spl. P.P. Fast Track Court, Jagtial.

4.B. Rajesh, APP I ADM Court, Jagtial

5.G.Pranay, APP, JFCM Court, Metpally