# Tags
#తెలంగాణ #హైదరాబాద్

మార్కెట్ చైర్మన్ కు ప్రత్యేక శుభాకాంక్షలు

సికింద్రాబాద్, బోయిన్ పల్లి :

బోయిన్ పల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ కు ఇటీవల నూతనంగా ఎన్నికైన చైర్మన్ రాగిరి ఆనంద్ బాబుకు మార్కెట్ కమిషన్ ఏజెంట్ ములుపాల దేవేందర్ తోటి వ్యాపారస్తులతో కలసి చైర్మన్ ఆనంద్ బాబును కలిశారు.

ఈ సందర్బంగా చైర్మన్ ఆనంద్ బాబును శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంలో దేవేందర్ మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో నూతన కమిటీ ఎన్నికైనందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు