# Tags

విధినిర్వహణలో ఉండే పోలీస్ లకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి:ఎస్ పి అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్): సంపత్ కుమార్ పంజ
రాజన్న సిరిసిల్ల జిల్లా రెండవ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు సిరిసిల్ల మినీ స్టేడియంలో సోమవారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిలుగా హాజరై శాంతికపోతాలను,బెలూన్స్ ఎగురవేశిన,అనంతరం పోలీస్ క్రీడాకారులు ఒలంపిక్ కాగడ చేతభూని పరేడ్ గ్రౌండ్ చుట్టు పరుగెత్తి క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.అధికారులు , సిబ్బందితో కలసి షటిల్,కబడ్డీ, వాలిబల్ ఆడి అందరిని జిల్లా ఎస్పీ ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందనే ఉద్దేశ్యంతో జిల్లాలో రెండవ సారి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని,ఈ మీట్ లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహకంగా పాల్గొనాలని, ఆటల్లో గెలుపోటములనేవి సహజమెఅని గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు.అధికారులకు, సిబ్బంది ప్రతి ఒక్కరికి డ్యూటీ,ఫ్యామిలీ ఒత్తిడి ఉంటుందని క్రీడలు ఆడటం వలన మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వంతో పాటుగా ఆరోగ్యంగా ఉంటారన్నారు.పోలీస్ విభాగంలో విధినిర్వహణలో క్రీడలు,యోగ అనేవి ఎంతో అవసరమైనవని మనం అందరం క్రీడలు, యోగ నిత్యజీవితంలో అలవాటుగా మార్చుకోవాలని,విధి నిర్వహణలో భాగంగా మనం ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుందని శారీరకంగా దృఢంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.పోలీస్ అధికారులు, సిబ్బంది 24X7 విధులు నిర్వహించే సిబ్బందికి ఇలాంటి క్రీడల వలన ఉద్యోగుల్లో స్నేహ స్నేహ సంబంధాలు ఏర్పడటంతో పాటుగా ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని క్రీడలలో ఓడిన గెలిచిన పండుగ వాతావరణం మాత్రమే ఉంటుందని,సిబ్బంది ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండాలనదే ఈ క్రీడల యొక్క గొప్పతనం అన్నారు.ఈ పోటీలు మూడు రోజుల పాటు DAR హంటర్, సిరిసిల్ల స్టైకైర్స్,వేములవాడ విక్టర్స్, వేములవాడ రుద్రస్, సిరిసిల్ల సోల్జర్స్,DAR రేంజర్స్ జట్ల మధ్య క్రికెట్, షటిల్ బ్యాట్మెంటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, తగ్గాఫర్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ మరియు అథెలిటిక్స్ క్రీడలు జరుగుతాయని, ఆటలను అందరు చక్కగా సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి,శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు,శ్రీనివాస్, ఆర్.ఐ లు మధుకర్, రమేష్,ఎస్.ఐ లు,వ్యాయమ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.