# Tags

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కృషి చేస్తా:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనాన్ని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని నారాయణ పూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ దేవనాథ జీయర్ స్వామి తో కలిసి సందర్శించిన ఆది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలోని శ్రీ రామకోటిని
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని నారాయణ పూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ దేవనాథ జీయర్ స్వామితో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
శుక్రవారం సందర్శించారు,ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 1966లో భారతదేశంలోనే 70 వ శ్రీరామ కోటి స్థూపాన్ని పెద్ద జీయర్ స్వామి చేతుల మీదుగా ఎల్లారెడ్డిపేటలో స్థాపించుకోవడం జరిగిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వివరించారు, సత్సంగ సదనం అధ్యక్షులు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి తో లక్ష్మమ్మతో వారు మాట్లాడారు, అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి పురాతన బాలాలయానికి వెళ్లి, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ దేవనాథ జీయర్ స్వామి వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులు గోపాల చారి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యుల పేరిట అర్చన చేసి మంగళ శాసనాలు
తీర్థ ప్రసాదాలు వితరణ చేసి ఆశీర్వచనాలు అందించారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వాలు కోటి 80 లక్షలు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వాలు మారాడం చేత నిధులు వాపస్ పోయాయని అట్టి నిధులను ఇప్పించాలని ఆది శ్రీనివాసు కు వివరించారు,
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్ధరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు,
చరవాణి ద్వారా ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు
హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందని , పురాతన ఆలయాల పునర్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అనంతరం నారాయణపురం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని వారు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్త బృందం వారికి ఘన స్వాగతం పలికారు ,నారాయణపురం అమ్మవారి ఇంటిలో చిన్నతనంలో ఉండి ఆలయంలో పూజా విధానం గురించి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ దేవా నాథ చిన్న జీయర్ స్వామి జ్ఞాపకాలను ఆది శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులతో గుర్తు చేసుకున్నారు ,వారి వెంట బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు షేక్ సబేరా బేగం గౌస్ బాయి , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామ్ రెడ్డి , ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, అద్యక్షులు సూర నరసయ్య , ప్రతినిధులు బొమ్మ కంటి రవి గుప్తా ముత్యాల ప్రభాకర్ రెడ్డి , పారిపెల్లి రాంరెడ్డి , గుండాడి వెంకట్రెడ్డి మాజీ అధ్యక్షులు మేగీ నరసయ్య , పందిర్ల లింగా గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి బండారి బాల్ రెడ్డి , చందనం మల్లేశం గుర్రపు రాములు , మండే శ్రీనివాస్ యాదవ్ రవి పందిలా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు,