#తెలంగాణ

ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం

రథోత్సవం తరువాతే…నూతనంగా కమిటీ ఎన్నిక – గ్రామస్తుల తీర్మానం

(తెలంగాణ రిపోర్టర్ )సంపత్ కుమార్ పంజ…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట్ లో బ్రహ్మోత్సవాలను నవంబర్ 15 వ తేదీ శుక్రవారం నిర్వహించ తలపెట్టిన రథోత్సవం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని గ్రామస్తులు ఆదివారం తీర్మానించారు,
శ్రీ వేణుగోపాల స్వామి పురాతన ఆలయం వద్ద మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నందికిషన్ , మెగి నరసయ్య పందిళ్ళ లింగం గౌడ్ ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు సనుగుల ఈశ్వర్ లతో గ్రామస్తులు వివిధ కుల సంఘాల పెద్దలు సమావేశమయ్యారు , ఆదాయం ఖర్చుల వివరాలను వారి సమక్షంలో పరిశీలించారు

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ ఐ.వి సుబ్బారెడ్డి తో మంజూరి చేయించారని అట్టి నిధులతో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్ తో నూతన ఆలయాన్ని నిర్మించాలని అందుకోసం మాజీ అధ్యక్షులు నంది కిషన్, నిర్మాణ కమిటీ అధ్యక్షులు సనుగుల ఈశ్వర్, ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ తో పాటు ఆయా పాలక వర్గం కమిటీ సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్రెడ్డి , కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ లతో ప్రయత్నాలు చేస్తున్నామని గ్రామస్తుల సమక్షంలో వారి వారి ప్రయత్నాలను వారు వివరించారు ,
ఇది విన్న గ్రామస్తులు శ్రీ వేణుగోపాల స్వామి కార్తిక మాస బ్రహ్మోత్సవాలను ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ పాలక వర్గం నిర్వహించాలని తీర్మానించారు,

అందుకు ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు నంది కిషన్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు సనుగుల ఈశ్వర్ పాలకవర్గం అందరూ ప్రస్తుత చైర్మన్ గడ్డం జితేందర్ కు పాలకవర్గానికి సహకరించాలని గ్రామస్తులు తీర్మానించారు,
కార్తీక పౌర్ణమి అనంతరం నూతనంగా ఓకే ఆలయ కమిటీని ఎన్నుకోవాలని గ్రామస్తులు తీర్మానించారు ,
ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు

ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *