#తెలంగాణ #హైదరాబాద్

శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న ‘స్వచ్ఛదనం… పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా

శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న ‘స్వచ్ఛదనం… పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా

-ఆలయంలో పూజలు

‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.

అనంతరం, ఆలయ కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం గావించి, తీర్థ ప్రసాదాలు  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, ఆలయ పర్యవేక్షకులు హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *