# Tags
#తెలంగాణ #Culture #Events

తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని :

తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం మంథని పట్టణం లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు.

టీ పి సి సి ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేరియన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, వొడ్నల శ్రీనివాస్, పోలు శివ, తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధులు ఉన్నారు.

ఈ సందర్భంగా, రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పత్రికలు సమాజ శ్రేయస్సుకోసం పాటుపడాలని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషికి, తమ ప్రభుత్వం ప్రజాపాలనతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ రంగం తోపాటుగా, అన్ని రంగాలలో ముందుకు వెళుతున్నామన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్టర్ editor సిరిసిల్ల శ్రీనివాస్ ను అభినందిస్తూ,మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా, నాన్నే నాకు ఆదర్శం, ఆయనే ఒక స్ఫూర్తి గా ప్రజాపాలనలో, మంథని బిడ్డగా, ప్రజల మనిషి శ్రీపాద తనయుడిగా అన్ని వర్గాలవారికి మార్గదర్శి రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అని తెలంగాణ రిపోర్టర్ editor సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు.

అందుకే ఆ కాన్సెప్ట్ (నాన్నే నాకు ఆదర్శం, ఆయనే ఒక స్ఫూర్తి) తోనే 2025 క్యాలెండర్ ను ప్రజాక్షేత్రం కు అందించామన్నారు.

ఇందుకు తనకు అవకాశం ఇచ్చిన తన ఆత్మీయులు, రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే, తనకు ముందునుండీ సహకరించిన శశిభూషణ్ కాచే కు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.