# Tags
#తెలంగాణ #హైదరాబాద్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి :

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానమనకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా దేవస్థానం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం, వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ మరియు దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జక్కు రవీందర్ శ్రీ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.

అలాగే మాజీ శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డికి శ్రీ స్వామి వారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జక్కు రవీందర్ మరియు సభ్యులు దేవస్థానం వేద పండితులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.