పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటాం:జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మానకొండూర్ : (కనకయ్య ముడికే)

మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
మంగళవారం మానకొండూరు మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయిలు హాజరైనారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు మరుగుదొడ్లను వాడేలా వారి పరిసరాల ప్రాంతాలలో సైతం వాడుకునేలా విద్యార్థిని విద్యార్థులు చూడాలని వాటిని పరిశుభ్రతను కూడా చూడాలని అందుకు ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. కొందరు మరుగుదొడ్లను వాడకుండా పరిసరాల ప్రాంతాలను వాడుకోవడం ద్వారా అనారోగ్యం పాలవుతున్నారని గుర్తు చేశారు.

ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్మిస్తుందని వాటిని మెంటెనెన్స్ చేయడం బాధ్యతగా పాఠశాల యజమాన్యం విద్యార్థులు చూసుకోవాలన్నారు సామూహిత మరుగుదొడ్ల నిర్వహణ కొంత ఇబ్బందిగా ఉంటుందని వాటిని సైతం సామాజిక స్ఫూర్తితో తీసుకొని చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.
అనంతరం ఉపన్యాసాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీఓ కిరణ్ కుమార్, ఏం ఈ ఓ మధుసూదన చారి, డిప్యూటీ తాసిల్దార్ సమ్మయ్య, స్వచ్ఛభారత్ జిల్లా కన్వీనర్ కిషన్ స్వామి, కన్సల్టెంట్ రమేష్, వేణు, కళ్యాణి, రవీందర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *