# Tags
#తెలంగాణ

రాయికల్ క్రికెట్ లీగ్ 57 మ్యాచ్ లలో ఎస్.టి.ఆర్ రైజర్స్ విజయం

ఆర్ సి ఎల్ విజేత ఎస్ టి ఆర్ రైజర్స్

రాయికల్: S. Shyamsunder :

జనవరి 19 నుండి ఫిబ్రవరి 2 వ తేది వరకు నిర్వహించిన రాయికల్ క్రికెట్ లీగ్ 57 మ్యాచ్ లలో ఎస్.టి.ఆర్ రైజర్స్ విజయం సాధించింది. రన్నర్ అప్ ఏడిఆర్ వారియర్స్, మూడవ స్థానంలో ఎం ఆర్ సూపర్ కింగ్స్ విజేతలుగా నిలిచారు.

విన్నర్స్ కి 30 వేల నగదు ట్రోఫీని ఆక్స్ఫర్డ్ స్కూల్ అధినేత బోగ రవి ప్రసాద్ అందజేశారు.

రెండవ బహుమతి 20వేల నగదును ఇందూరి గంగాధర్, మూడో బహుమతి పదివేల నగదు రూపాయలను రాజారాణి రెస్టారెంట్ కిరణ్ రెడ్డిలు అందజేశారు.

ప్రతి ఆటగాడికి నోవా హాస్పిటల్ అధినేత గట్టు నరేష్ అందించగా టైటిల్ స్పాన్సర్షిప్ సత్య హాస్పిటల్ ఉదయ్ కుమార్ లు అందజేశారు.

బాల్స్ స్పాన్సర్ గా శ్రీ రామ సూపర్ మార్కెట్ హరీష్ అందించారు.ప్రతి మ్యాచ్ కి
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తూ, సిరీస్ మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ చిట్టేటి విక్రం రెడ్డి కి అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పాల్గొన్నారు.

ఆర్గనైజర్స్ గా మ్యాకల రమేష్, కొయ్యడి మహిపాల్, ఎద్దండి దివాకర్ రెడ్డి, మోర రామ్మూర్తి, కాటిపల్లి రాంరెడ్డి, ఎలిగేటి అనిల్, కల్లెడ ధర్మపురి, బత్తిని నాగరాజు,భూమయ్య తదితరులు పాల్గొన్నారు.