#తెలంగాణ

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా..

అధికారులకు, సిబ్బందికి బందోబస్తు సందర్భంగా పూర్తి వివరాలతో దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

బుధవారం రోజున జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1100 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడo జరిగిందని ఎస్పీ తెలిపారు.వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో బందోబస్తుకి వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి బందోబస్తులో భాగంగా చేపట్టవలసిన విధులపై దిశానిర్దేశం చేసిన ఎస్ పి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తులో వివిధ జిల్లాల నుండి దాదాపు 1100 మంది అధికారులు సిబ్బంది పాల్గొననున్నారని,బందోబస్తును సెక్టార్ల గా విభజించి అడిషనల్ ఎస్పీ,డిఎస్పీ ,ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించడం జరిగిందన్నారు.బందోబస్త్ కి వచ్చిన పోలీస్ అధికారులకు,సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను పూర్తి అప్రమత్తతో ఐడి కార్డులను తప్పనిసరిగా ధరిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.హెలికాప్టర్ వద్ద విధులు నిర్వహించేవారు అలర్ట్ గా ఉండాలని హెలికాప్టర్ వద్దకు ఎవరిని రానివ్వకూడదని సూచించారు. ప్రతి అధికారి బందోబస్తు కేటాయించిన ప్రాంతంపై పూర్తి అవగాహన మరియు చేయవలసినటువంటి డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు.డ్యూటీ ప్రదేశం నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళకూడదు అని డ్యూటీ పరంగా లేదా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఈ యొక్క కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, జిల్లా పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *