# Tags

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే విద్యార్థుల మెస్ చార్జీలు పెంచారు :ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణంలోని భవానీ నగర్ లోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ను నాయకులతో కలసి సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సందర్శించారు. 

హాస్టల్ లోని స్టోర్ రూమ్, వంట గదిని, పరిశీలించి అనంతరం మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ. ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

ఈ 10 సంవత్సరాల్లో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మెస్ చార్జీలు పెంచడం జరిగిందని, అలాగే బాలికలకి కాస్మొటిక్ చార్జీలు కూడా పెంచడం జరిగిందని తెలిపారు. 

రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లల చదువులు ఆపొద్దని ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు.

సొంత భవనాలు లేని కారణంగా అద్దె భవనాల్లో పాఠశాలలు నిర్వసిస్తున్న విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ 200 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.  

విద్యార్థులతో కలసి భోజనం చేశానని, పప్పు, గోరు చిక్కుడుకాయ కూర, పచ్చిపులుసు, పెరుగుతో భోజనం రుచిగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.