# Tags
#తెలంగాణ

విద్యార్థుల్లో చదువుతో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించాలి:జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కే. లక్ష్మన్న

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ :

విద్యార్థుల్లో చదువు తో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కోమ్మిడి లక్ష్మన్న సూచించారు.

రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ,బాలికలు ,ఉర్దూ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం బుధవారం పరిశీలించింది. తనిఖీలో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు రికార్డుల నిర్వహణ మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం తరగతి గదిలో బోధన విధానం
తదితర అంశాలను వారు పరిశీలించి, తగిన సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆటలు ఆడించారు. విద్యార్థులు వివిధ రకాల ఆటలు ఆడునట్లు ప్రోత్సాహం ఇవ్వాలని వారిలో క్రీడా సామర్థ్యాల పెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తనిఖీ బృంద సభ్యులు లక్ష్మీరాం నాయక్ , శ్రీనివాసరావు, దాసరి రామస్వామి, ధర్మేందర్, టి.శ్రీనివాస్ ,శ్రీధర్, రవీందర్, సంయుద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,కాపు శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు పి.గంగాధర్,పి.రమేష్ ఉపాధ్యాయులు పి.రాజశేఖర్ చెరుకు మహేశ్వరశర్మ, రాజమహ్మద్,ఎ.పద్మ
జి.తరంగిణి,ఎ.రజిత.యస్.శోభ, రాజమహ్మద్ తదితరులు పాల్గొన్నారు.