# Tags
#Events #జగిత్యాల #తెలంగాణ

విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి-ప్రగతి ప్రిన్సిపాల్ బాలె శేఖర

రాయికల్: S. Shyamsunder

పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల 40 వ వార్షికోత్సవ వేడుకలు” ప్రగతి విజయయానం” అనే పేరుతో ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించబడినవి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, 40 సంవత్సరాలు విద్యారంగ చరిత్రలో ఎందరో విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దిన ఘనత ప్రగతికి దక్కిందని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

చదువుపై మక్కువను ఏర్పర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ప్రత్యేకంగా ఊరు పల్లెటూరు… జానపద పాటలు… దేవుళ్ల పాట ఆహుతలను మైమరిపింపజేశాయి.

అనంతరం పాఠశాల పోషకులకు విద్యార్థులకు భోజన పద్ధతిని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ బృందాన్ని శాలువతో సన్మానించారు. ఉపాధ్యాయ బృందం పాఠశాల యాజమాన్యాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బాలె జయశ్రీ , అక్కడ మీకు డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఉపాధ్యాయ బృందము పోషకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.