# Tags
#తెలంగాణ

డయాలసిస్ టెక్నీషియన్ అనుమానాస్పద మృతి…

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రిలో డయాలసిస్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న కొపురి మాధవ (29) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కోపూరి శేషగిరి తండ్రి శ్రీనివాసరావు వయస్సు 29 సంవత్సరాలు, కులం మాల, నివాసం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ నల్గొండ జిల్లా అనునతడు దరఖాస్తు ఏమనగా తన తమ్ముడైన కోపూరి మాధవ వయస్సు 27 సంవత్సరాలు అనునతడు గత మూడు సంవత్సరాల నుండి ఎల్లారెడ్డిపేట లోని అశ్విని హాస్పిటల్ నందు డయాలసిస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఫిర్యాది తమ్ముడైన కోపూరి మాధవ తేదీ 11.10.2024 రోజున రాత్రి 11:20 గంటలకు పడుకొని తెల్లవారుజామున తేదీ 12. 10 .2024 రోజున ఐదున్నర గంటలకు కూడా తలుపులు తెరవకపోయేసరికి, తలుపులు పగలగొట్టి చూడగా మరణించినందున మృతుడి అన్న ఇచ్చిన పిటిషన్ పై అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనదని ఎల్లారెడ్డిపేట ఏస్ ఐ రమాకాంత్ తెలిపినారు