విద్యార్థులకు ప్రాథమిక దశనుండే వివిధ బాధ్యతల పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి: డా. వి. నరేందర్ రెడ్డి

స్పూర్తినింపిన జగిత్యాల కృష్ణ నగర్ అల్ఫోర్స్ క్యాప్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవం విద్యార్థులకు వారి విధుల పట్ల చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా బాధ్యతలను నిర్వర్తించే విధానాలను తెలియపర్చాలని తద్వారా సమాజంలో అగ్రగామిగా ఉండవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్థానిక క్రిష్ణానగర్లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల ప్రాంగణంలో వేడుకగా నిర్వహింపబడిన వివిధ విభాగాల క్యాస్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. […]