హిరోషిమాలో ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు

జపాన్ దేశం హిరోషిమా నగరంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఇద్దరు తెలుగు అమ్మాయిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎదుట తెలంగాణ అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, హిరోషిమా లెజిస్లేచర్ ప్రతినిధిలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించడానికి వెళ్లిన సమయంలో హర్షిణి (8 వ తరగతి), హరిణి (7 వ […]

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) గారితో సమావేశమై పలు అంశాలను చర్చించింది. పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు. […]

పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులతో కూడిన బృందం కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టెక్యూచి తో సమావేశమైంది. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన […]