రాష్ట్ర ఐటి, సాంకేతిక, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుచే జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ పంచాంగం ఆవిష్కరణ

ఉగాది పండుగ శుభాకాంక్షలతో. …మంత్రి శ్రీధర్ బాబు హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను నిర్వహించుకుంటాం. ఈసారి తెలుగు సంవత్సరానికి విశ్వావసు అని పేరు. ఈ నేపథ్యంలో…రాష్ట్ర ఐటి, సాంకేతిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం కేంద్రంలో జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ చే ముద్రణ […]

మంథనిలో విధుల బహిష్కరించిన న్యాయవాదులు

మంథని : హైదరాబాదులో న్యాయవాది ఇజ్రాయిల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంథనిలో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు మంథనిలో న్యాయవాదులు అందరూ కలిసి ఇజ్రాయిల్ మృతికి సంతాపం తెలుపుతూ విధులను బహిష్కరించామని తెలిపారు. న్యాయవాదులపై దాడులు జరగడంతో పాటు హత్యలకు పాల్పడుతున్నారని న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ, మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి మూల […]

శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము

శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః || మంథని : స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ చతుర్థి తేది|| 19-05-2006 సామవారం నుండి ఫాల్గుణ శుద్ధ దశమి  ఆదివారం వరకు సప్తాహ్నిక దీక్షతో (ఏడు రోజులపాటు) సహస్రాధిక బ్రాహ్మణ గడప కలిగిన పవిత్ర గోదావరి నది తీరమునందు గల అగ్రహారమైన (మంత్రపురి) మంథని గ్రామమునందు గల శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామివారల దేవాలయ ప్రాంగణము నందు […]

మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి, నివాళులు

న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి లు దారుణ హత్యకు గురై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నందున దోషులను శిక్షించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున మంథని బార్ అసోసియేషన్ అద్యక్షులు KVLN హరి బాబు ఆవేదన వక్తం చేశారు. మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా, శనివారం మంథని నియోజకవర్గ కేంద్రంలో ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటి,పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు  ఘనంగా నివాళులర్పించారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, […]

డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు 

భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,  శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు  మంథని : స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగంలో కేవలం పదాలు కాదు. అవి రాజ్యాంగం ప్రాణం అని చాటి చెప్పిన భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం  డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ 113 జయంతి సందర్భంగా మంథని నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహానికి పూలమాలలు […]