కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి…ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజురాబాద్ 🙁 M.Kanakaiah): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

ఎక్లేసియా మినిస్ట్రీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు

హుజురాబాద్: (M. Kanakaiah): హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎక్లేసియా మినిస్ట్రీ రెవరెండ్ డాక్టర్ డి డేవిడ్రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు బుధవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ వర్తమాని బిషప్ డేనియల్ డి కళ్యాణపు హాజరై క్రీస్తును గురించి ప్రత్యేక సందేశం అందించారు. ఏసుక్రీస్తు ఒక ప్రాంతము ఒక దేశము వాడు కాదని ప్రపంచ శాంతి దూతగా పాప విముక్తి కోసం సిలువలో ప్రాణ త్యాగం చేసిన గొప్ప […]

ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌: హైదరాబాద్ : కేటీఆర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌పై కేసు.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. కాగా, అసెంబ్లీ సమావేశల్లో ఉన్న కే టీ ఆర్ మాట్లాడుతూ, తనపై ఏ సీ […]

ప్రత్యేకంగా తమకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలి-ఎస్సీ కమిషన్ చైర్మన్ డా.జస్టిస్ షమీం అక్తర్ కు వినతి

హుజురాబాద్ : మాల మాదిగలతో కలపకుండా సపరేట్గా ఏర్పాటు చేసి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని, వెంటనే ఎస్సి ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ కి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ఎస్సీ ఉప కులాల్లో మేజర్ కులమైన బేడ బుడగ జంగం […]

వీధి కుక్కలు వెంట పడడంతో రోడ్డు పక్కన డ్రైనేజీలో పడిపోయిన బాలుడు-కాపాడిన మున్సిపల్ మహిళా ఉద్యోగి

కరీంనగర్ :(M. Kanakaiah) కరీంనగర్ లోని డాక్టర్స్ ఏరియా సాయి నగర్ రోడ్ నెంబర్ వన్ లో రోజువారీగా యధావిధిగా సైకిల్ పై స్కూల్ కి వెళ్తున్న విద్యార్థి బబుల్ పై మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో విధి కుక్కలు వెంట పడ్డాయి. దీంతో భయానికి గురైన బబుల్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ లో పడిపోయాడు. ఆ సమయంలో అటువైపు వెళుతున్న మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగి సుహార్ లత, ఆమె కూతురు […]

ముగ్గురు పేద యువతుల పెళ్ళిళ్లకి చేయూతనందించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి

జగిత్యాల: • కొండాపూర్ గ్రామానికి చెందిన “గాజూరి విజయలక్ష్మి – కీ.శే. శ్రీనివాసాచారి” కూతురు “అశ్విని” • రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన “అట్కాపురం రాజన్న – రాజవ్వ” కూతురు “ప్రవళిక“ • జగిత్యాల కు చెందిన “పేరాల గంగాధర్ – రాధ” గారి కూతురు “నిఖిత” అనే ముగ్గురు యువతుల వివాహం ఇటీవల నిశ్చయం అయ్యింది. ఐతే, వారి కుటుంబాలు ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందుల్లో ఉండి, ఎటువంటి ఆధారం లేక పోవడం […]

అడ్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో AAA ABACUS ఉచిత టీచర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం

అడ్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో AAA ABACUS ఉచిత టీచర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఆదివారం పొన్నాల గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్స్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ ఒక్కరోజు శిక్షణలో, బేసిక్ ఫండమెంటల్ ఇన్ అబాకస్ మరియు అబాకస్ లెవెల్ వన్ నేర్పించబడింది. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు అత్యద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. శిక్షణ అనంతరం, వారు క్యాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కలు చేసి, “మాకు మేమే నమ్మలేకుండా […]

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం- మొదటి రోజు ప్రశాంతం 

జగిత్యాల: – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం కాగా, మొదటిరోజున రెండు సెషన్స్ లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని కోరుట్లలో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాటు జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్ , జేఎన్టీయూ కళాశాలను ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బి,సత్య ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం 3 […]

2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

జగిత్యాల: జిల్లా కేంద్రంలో 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఆదివారం మధ్యాహ్నం 3గంటల  ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని, 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ […]

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన MLA డా. సంజయ్ కుమార్ 

రాయికల్ మండలంలో : రాయికల్ మండలం బోర్నపల్లి ,ధర్మాజీపేట గ్రామాలలో 20 లక్షల చొప్పున నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో  జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు ముఖ్యం అనీ,సేవ ద్వారానే వైద్యులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. సాధారణ ప్రసవాల పట్ల వైద్యులు, ఆశా వర్కర్లు,తల్లి దండ్రులు అవగాహన […]