జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు
జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) గారితో సమావేశమై పలు అంశాలను చర్చించింది. పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు. […]