# Tags

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి కలెక్టర్ సాయం..

(తెలంగాణ రిపోర్టర్, Sampath panja): అగ్ని ప్రమాదంలో ఇల్లు, సామాగ్రి కాలిపోయిన బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా కు చెందిన ఏ. కైక కు సంబంధించిన పూరి గుడిసె మంగళవారం రాత్రి విద్యుత్ ప్రమాదంలో కాలిపోయింది. దీంతో ఇంట్లోని వంట సామగ్రి, బియ్యం కూలర్ ఇతర సామాగ్రి కాలి, పాడైపోయాయి. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ […]

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్

రాయికల్ : S. Shyamsunder చారిత్రాత్మక నిర్ణయం…మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ ఆమోదం కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ అన్నారు. బుధవారం రాయికల్ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాల, […]

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాలక్రితం ప్రతిష్టించిన, గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసులు శ్రీ వీరభద్ర స్వామి, లక్ష్మి భ్రమరాంబిక దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణం జరిపించారు. అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి […]

జిల్లాలో పదవతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల : బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాధికారి,చీఫ్ సూపర్డింట్ వెహికల్ ఇంచార్జ్, సిట్టింగ్ స్వాడ్, ప్రిన్సిపల్ లతో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 67,పరీక్ష కేంద్రాలలో 11,865 మంది విద్యార్థులు బ్యాక్ లాగ్ విద్యార్థులు 285 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పదవ […]

అంగన్వాడీలో చిన్నారికి జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder మండలంలోని వడ్డెరకాలనీ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం ప్రీస్కూల్ విద్యార్థి విశ్వక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంగన్వాడీ టీచర్ బియ్యని సుజాత చిన్నారితో కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….రెండు సంవత్సరాల 6 నెలల పిల్లలనుండి ఆరు సంవత్సరాల వయస్సు వరకు గల పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. వారికి సంబంధించిన అక్షరాభ్యాసం,అన్నప్రాసన, జన్మదిన వేడుకలను అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించుకుంటూ పిల్లలకు […]

తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

(తెలంగాణ రిపోర్టర్)రాజన్న సిరిసిల్ల.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ పరిసరాలు,స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో స్వాదీనం చేసుకున్న వాహనాల వివరాలు,స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న,నమోదైన కేసుల వివారలు, స్టేషన్ రికార్డ్ లు పరిశీలించి, పెండింగ్ కేసులపై అరా తీసి త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…నమోదు అయిన కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందిస్తూ […]

కుక్కకాటుకు గురైన బాలికకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరామర్శ

విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) రాజన్న సిరిసిల్ల : కుక్క కాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే […]

మంగళవారం శాసన మండలిలో “ఫ్యూచర్ సిటీ”పై మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ : ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్ గుర్తుకు వస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను కూడా అటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. శంషాబాద్ విమానాశ్రయం మరియు ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) ను కేంద్రంగా చేసుకుని పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా “ఫ్యూచర్ సిటీ” పేరిట ప్రత్యేక నగరాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచ […]

Astronauts Sunita Williams and Butch Wilmore are on their way back to Earth

BACK TO EARTH WHAT: Astronauts Butch Wilmore and Sunita Williams are on their way back to Earth. A successful SpaceX mission to the International Space Station (ISS) delivered four astronauts, swapping the crew and bringing the two home. WHEN: The two are expected to return on March 18, Tuesday evening (GMT), sometime late in the […]

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు…

రాయికల్ : S. Shyamsunder భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగడానికి అలాగే పరీక్షలు ఎలా సన్నద్ధమవ్వాలో పలు సూచనలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు వేణుగోపాల్ పరీక్ష ప్యాడ్ లతో సహా పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఉమ్మెంతల వెంకటరమణి, […]