# Tags

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి…

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి నన్నుతరింపజేసిన తీరు …!!! దర్శించితిని తల్లి !!వేములవాడ సామ్రాజ్ఞి …!!!నిను నవ వధువుగా,కాత్యాయనివై తపంబున గెలిచి రాజేశ్వారుణ్ణి మనువాడి , మెట్టినింట(కైలాసంబున) అడుగుపెట్టగా…!!! బ్రాహ్మీ ముహూర్తమందు నల్లని చీకటిని దట్టమైన నీ కేశభారములుగా ,నక్షత్రాలను శివయ్య వేసిన తలంబ్రాలుగా , అటుగా ఉన్న పాలపుంతను జీలకర్రాబెల్లపు ముద్దగా ,శేష చంద్రుని కాంతిని నీ నుదుటన బాసింగముగా దర్శించితిని తల్లీ రాజ రాజేశ్వరివేములవాడ సామ్రాజ్ఞి …!!! తొలిసంధ్యన ఉదయించిన […]

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్  బాబు

ధర్మపురి  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం […]

ఈ ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే -రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధర్మపురి… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘం హాల్ప లో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ అభ్యర్థి […]

కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి,నిరుద్యోగులకు అండగా ఉంటాం…

రాయికల్ : S. Shyamsunder కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రూపొందించి ఉద్యోగాల భర్తీ చేపట్టిందని విద్యావంతులైన పట్టభద్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలోని వి ఎస్ గార్డెన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2018 శాసనసభ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాన్ని పొందలేక కొంత నిరాశ చెందాం… […]

భూపాలపల్లిలో నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ దారుణ హత్య!

భూపాలపల్లి : (గుజ్జెటి శ్రీనివాస్) భూపాలపల్లిలో దారుణ హత్య. నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ ను పొడిచి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు. జిల్లా కేంద్రం భూపాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన తాజా మాజీ కౌన్సిలర్ భర్త, సోషల్ ఆక్టివిస్ట్ రాజలింగమూర్తి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రధాన కూడలి అయిన అంబెడ్కర్ సెంటర్ కు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంటర్ నుంచి తను నివాసం ఉండే రెడ్డికాలని కి వెళుతుండగా […]

రాయికల్ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, శోభాయాత్ర

రాయికల్: S. Shyamsunder : చత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకొని హిందూ సంఘాల పిలుపుమేరకు బుధవారం సాయంత్రం శివాజీ బొమ్మ నుండి, పాత బస్టాండ్ మీదుగా గాంధీ బొమ్మ, వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ…..హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని […]

తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న కొందరి తీరుతో ఆ శాఖ పరువు అడవిపాలు!

మంథని : (గుజ్జటి శ్రీనివాస్) అపార మైన ఖనిజ సంపదకు , అత్యంత విలువైన వృక్ష జాతులకు, అపురూప మైన జీవ రాసులకు నెలవులు ఆ అడవులు. అలాంటి అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేకంగా అటవీ శాఖ, అందులో క్షేత్ర స్థాయి నుంచి మొదలు రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ఆ శాఖలో వృత్తి పట్ల నిబద్దత, విధుల్లో అంకిత భావం కలిగిన అధికారులు సిబ్బంది ఎందరెందరో…. కానీ.. తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న కొందరి […]

అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్  విస్తృత తనిఖీలు

జగిత్యాల -జిల్లాలోని దమ్మన్నపేట ఆరెపెల్లి గోదావరి నది ఇసుక రీచ్ ల పరిశీలన, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు సీజ్  ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జిల్లా లోని దమ్మన్నపేట మరియు అరెపెల్లి  గ్రామాల శివారులోని గోదావరి నది ఇసుక రీచ్ వాగులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ […]

స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ (T-Hub), బ్రెజిల్‌లోని గోయస్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హబ్‌ గోయస్ (HUB GOIAS)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసీసీలో హబ్ గోయస్ (HUB GOIAS) ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్, బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ […]

మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని నాయకుల ప్రచారం

మంథని మండలం : రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని మండల పరిధిలోని సూర్యయ్యపల్లె గ్రామంలోని మేరీ మీడియట్రిక్స్ హైస్కూల్ మరియు అలోక్ పబ్లిక్ హైస్కూల్ లలో…. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంథని నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఐత ప్రకాష్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రిసిటీ మెంబెర్ శేశిభూషణ్ కాచే తదితర కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. మంత్రి శ్రీధర్ బాబు సూచించిన విధంగా […]