నకిలీ వైద్యులు, అర్హత లేని వైద్యంపై టీజీఎంసి కొరడా

వేములవాడ సిరిసిల్లల్లో పలు క్లినిక్స్ పై టీజీఎంసీ బృందం తనిఖీలు… (రిపోర్టర్, సంపత్ పంజ): రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణా వైద్య మండలి చైర్మన్ డా మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మేరకు సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలోని యాంటీ క్వేకరి బృందం పలు వైద్యుల సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో… సిరిసిల్లలోని గాంధీ గోపాలరావు నగర్ కి చెందిన బాబా క్లినిక్ నిర్వహిస్తున్న మాదాసు లక్ష్మణ్, పోతుగల్ […]

మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు శిక్ష -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్): మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 1000 రూ.ల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన వేములవాడకు చెందిన బాలికను ఆమె ఇంటి దగ్గరలో వుండే దొమ్మటి ఆనంద్, గొల్లపల్లి శశి, పబ్బ రాజేష్, […]

గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

జగిత్యాల జిల్లా కొడిమ్యాల: (నర్రా రాజేందర్): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది.  డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి  చెందిన యదరవేణి రవీందర్ మార్చి 27న దుబాయిలో మరణించగా అతని భార్య మౌనికకు, […]

వినియోగదారుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తున్న గాయత్రి బ్యాంకు సేవలపట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హర్షం

-మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 50వ శాఖను ప్రారంభించిన కలెక్టర్ కుమార్ దీపక్ IAS అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, వినియోగదారుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తున్న ది గాయత్రి బ్యాంకు అందిస్తున్న సేవలపట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 50వ శాఖను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభించారు. ఈ […]

అభివృద్ధికి అడ్డుగోడలా ఎమ్మెల్యే నిలుస్తున్నారు:కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపణ

కామారెడ్డి, (తెలంగాణ రిపోర్టర్): అభివృద్ధికి అడ్డుగోడలా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిలుస్తున్నారని కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు.పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ…అన్ని వసతులు ఉన్న కామారెడ్డి నియోజకవర్గానికి రావలసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జుక్కల్ కి తరలి వెళ్ళిపోయిందని,రాష్ట్రంలో 13 నర్సింగ్ కాలేజీలు రాగా కామారెడ్డికి ఎమ్మెల్యే వైఖరి వల్ల రాలేదు అని విమర్శలు చేశారు. […]

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు -ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకుఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం అంటున్న రైతులు -జిల్లా వ్యాప్తంగా రైతుల హర్షం -జిల్లా సహకార శాఖ ద్వారా రూ. 60 లక్షల విలువగల 2590 క్వింటాల్ల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు: జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్ సన్న రకం వరిధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు […]

రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500రూ.బోనస్ -రైతుల సంబరాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేసిన రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500 రూ. బోనస్ పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపు కుంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు :మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మా ధ్యేయం -ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధర్మపురి, జగిత్యాల జిల్లా : ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు […]

ప్రమాదవశాత్తు కారు దగ్ధం – మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది…

(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో బాలెనో కార్ రాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఇంటిముందు పార్కింగ్ చేసి ఉన్నా కారు ప్రమాదానికి గురికావడంకు గల కారణాలు పరిశీలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంఖుస్థాపన

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…రఘువంశీ ఏరోస్పేస్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. రూ.300 కోట్లతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కర్మాగారం రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు వేల కోట్ల విలువైన ఆర్డర్‌లకు సంబంధించిన పరికరాలను ఈ కొత్త సదుపాయంలో తయారు […]