# Tags

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా…పోస్టర్ ఆవిష్కరించిన సిఎం

జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం (World Day against Trafficking in Persons) సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వారు రూపొందించిన పోస్టర్ ను మహిళా శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి సీతక్క తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారికి ప్రజాప్రభుత్వం […]

చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో నేలకొరిగిన భారీవృక్షం

కరీంనగర్ : (ముడికె కనకయ్య): చిగురుమామిడి మండలం సీతారాంపూర్ స్టేజి సమీపంలో సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ కు వెళ్లే రహదారిపై భారీవృక్షం నేలకొరిగింది. గత రెండు రోజుల క్రితం వర్షాలకి బాగా నాని రోడ్డుపైన పడిపోయినది. సంఘటన స్థానంలో ఈ రహదారి పై వాహనదారులు ఎవరు రాకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీ వృక్షం రోడ్ పై పడిపోవడంతో హుస్నాబాద్ కరీంనగర్ నుండి వచ్చే వాహనాలకి చాలా ఇబ్బందికరంగా […]

కవి, రచయిత బండారి అంకయ్య గౌడ్ అస్తమయం

బండారి అంకయ్య అనేక కళలలో ప్రవేశమే కాదు, ప్రావీణ్యత గూడా ఉన్నవారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, నటులుగా, దర్శకులుగా, వ్యవహారకర్తగా, సమర్థులైన డిప్యూటీ కలెక్టర్ గా తెలుగు నేలలో భిన్న ప్రాంతాల వారికి సుపరిచితులు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ‘ప్రజలే ప్రభువులు’ నినాదంతో డా॥జయప్రకాశ్ నారాయణ ప్రారంభించిన ‘లోక్ సత్తా’ ఉద్యమంలో చేరి అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజలకు సన్నిహితులైనారు. ‘లోక్ సత్తా’ రాష్ట్ర కార్యదర్శిగా దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థానిక, మహిళా సాధికారత సదస్సులు […]

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి పతకం-షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన మనూ భాకర్

ఎవరీ మను భకర్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ భాకర్ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపాల్. మను చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. […]

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘంతో కలిసి ఆర్థికసాయం అందజేసిన జడ్పీ మాజీ చైర్ పర్సన్

నిరుపేద కుటుంబానికి జిల్లా మున్నూరుకాపు సంఘం సభ్యులతో కలిసి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ 6వ వార్డ్ కు చెందిన పడాల రాజేష్ మరణించగా వారి భార్య పడాల నితిష మరియు ఇద్దరి పిల్లలకు జిల్లా మరియు సంఘం వారితో కలిసి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ఆర్థిక సాయం అందజేశారు. ఇలాంటి […]

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో హాస్టల్ లను పరిశీలించిన ఎంపిఓ బృందం

వెల్గటూర్ :(జగిత్యాల జిల్లా): TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లి వార్డెన్ శ్రీమతి సునీత మరియు ANM, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ తో కలిసి వెల్గటూర్ మండల పంచాయతీ అధికారి జక్కుల శ్రీనివాస్ పరిశీలించారు. 100 మంది విద్యార్థులతో ఉన్న ఈ హాస్టల్ లోని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో ఆదివారం ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకు TSMS- బాలికల హాస్టల్, కుమ్మరిపల్లితో పాటు ఎండపల్లి ఎస్ సి […]

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు-అన్ని రూపాల్లో నిరసన : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారుఅన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు, కక్ష పూరితంగా వ్యవహరించారు, బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో […]

IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత

IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత సివిల్స్ దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదన్నారు. ‘దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందో ళనకు దిగుతారు. స్మితకు CS షోకాజ్ నోటీస్ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. సివిల్స్ […]

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు… హైద‌రాబాద్‌:   రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థను మెరుగుప‌ర్చ‌డానికి త్వ‌ర‌లోనే విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. అంగ‌న్‌వాడీ, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు నాణ్య‌మైన విద్య బోధ‌న‌, నైపుణ్య శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న‌కు త‌మ ప్ర‌భుత్వ క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ బ‌లోపేతంపై చ‌ర్చించేందుకు విద్యావేత్త‌ల‌తో స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. విద్యా వ్య‌వ‌స్థ […]

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు

రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ : తెలంగాణలోని రైతులందరి సూచనలు అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మా దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు.  శుక్రవారం సాయంత్రం కరీంనగర్ బైపాస్ […]