# Tags

NEET-2025 పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257 సాధించిన శ్రీతన్మయకు ‘తెలంగాణారిపోర్టర్’ శుభాకాంక్షలు

జగిత్యాల : రాయికల్ : శుక్రవారం వెలువడిన NEET-2025 పరీక్ష ఫలితాలలో జగిత్యాలజిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దాసరి శ్రీతన్మయ జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 3257 సాధించింది. ఇంటర్ BiPC లో 985 మార్కులు సాధించి మెడిసిన్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తల్లిదండులు దాసరి రామస్వామి, కల్పన ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, వీరి రెండవ కుమార్తె శ్రీతన్మయ వైద్య వృత్తిపై ఆసక్తితో నీట్ కు సిద్దమై జాతీయ స్థాయిలో మంచి ఫలితాన్ని సాధించింది.  ఈ […]

రోళ్ళ వాగు ప్రాజెక్టును రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

రోళ్ళ వాగు ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్య అటవీ శాఖ అధికారులు (పీసీసీఎఫ్) సువర్ణ IFS,శర్వానంద IFS తో కలిసి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ సందర్శించారు. రోళ్ల వాగు ప్రాజెక్టు అటవీశాఖ అనుమతుల కోసం హైదరాబాదులో పిసిసిఎఫ్ అధికారులను ఎమ్మెల్యే కలిసి ప్రాజెక్టు గేట్లు బిగించాలని వినతిపత్రాన్ని అందజేశారు…. దీంతో స్పందించిన అధికారులు వెంటనే రోళ్ల వాగు ప్రాజెక్టును సందర్శించడం అభినందనీయమని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించిన అధికారులు అటవీ శాఖ […]

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానమనకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా దేవస్థానం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం, వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ మరియు దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జక్కు రవీందర్ శ్రీ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది. అలాగే మాజీ […]

ఆశ-నిరాశలో ఆశావహులు

మోర్తాడ్ : స్థానిక సంస్థల పదవులపై భారీ ఆశలు పెట్టుకున్న ఆశావాహులు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఆరు మాసాల క్రితమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులకు ఎన్నికల శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలు జోరుగా సాగిన నేపథ్యంలో ఆశావావులు ఎవరికివారు వ్యూహాత్మకంగా పావులు కదుపుకున్నారు. ప్రభుత్వం ఒక్కసారిగా ఎన్నికల ప్రక్రియ ఆపివేయడంతో వారంతా తీవ్ర నిరాశలో మునిగిన విషయం విధితమే. తాజాగా ఆగస్టు నెలాఖరులుగా స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని జరుగుతాయని […]

డా.భూంరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ : సీనియర్ వైద్యులు కరీంనగర్ కు చెందిన డా.భూంరెడ్డి మరణం తీరని లోటని, వైద్య వృత్తితో పాటు సామాజిక సేవకై వారి జీవితం మొత్తం అవిరళ కృషి చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వారు ఎంఎస్ చదువుతున్న రోజుల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ పట్టా అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా అందుకొని ఆరోజుల్లో అనారోగ్య కారణాలతో జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చేరిన సమయంలో డా.భూంరెడ్డిని […]

సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి లక్ష్మణ్.కుమార్

కొత్తగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అడ్లూరి లక్ష్మణ్.కుమార్ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant […]

రాష్ట్ర మంత్రిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సాధించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సాధించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.  విద్యార్థి దశలో NSU  నాయకుడిగా ధర్మారం జెడ్పీటీసీ గా రాజకీయ ప్రస్థానం మొదలైన లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు. 2009 నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి […]

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూత

హైదరాబాద్ : భారాసకు చెందిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఈనెల 5న గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచాని వైద్యులు వెల్లడించారు. ఈనెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు కార్డియాక్ అరెస్టుకు గురై తుదిశ్వాస విడిచినట్లు […]

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టాలి : transco DE గంగారాం

మెట్ పల్లి : మెట్ పల్లి డివిజన్ వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయితీలు,అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను నెట్వర్క్ విస్తరణకు వాడే కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పోల్ టాక్స్ చెల్లించాలని మెట్ పల్లి డీఈ గంగారాం కోరారు. బుధవారం మెట్ పల్లి డివిజన్ లోని కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లు, ఆపరేషన్ ఇంజనీర్ల తో సమావేశం నిర్వహించి ప్రతీ స్తంభానికి వివిధ కంపెనీల […]

TUWJ-143 ఆధ్వర్యంలో తెలంగాణ అమరులకు నివాళులర్పించి, బైక్ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు

రాజన్న సిరిసిల్ల : ఎందరో అమరుల త్యాగ ఫలితంగా పురుడు పోసుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ-143 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అమరులైన త్యాగధనులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో తెలంగాణ తల్లి విగ్రహం వరకు పెద్ద ఎత్తున బైక్ […]