# Tags

హైదరాబాద్ లో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభం…

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్ ప్రారంభం కాగా, 110 దేశాలకు […]

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, పాత్రికేయుల ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావంగా, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలనికోరుతూ, జగిత్యాల పాత్రికేయుల ర్యాలీ జగిత్యాల: భారతప్రభుత్వంచేపట్టిన ఆపరేషన్ సిందూర్ మరియు భారత సైన్యానికి సంఘీభావం తెలిపేందుకు, జగిత్యాల పాత్రికేయులు శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించింది. అలాగే, గతనెల 22న పహాల్గామ్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మృతులైన వారికి మరియు పాకిస్థాన్ దాడుల్లో మృతిచెందిన జవాన్ మురళి నాయక్,  రాజా్రి డిప్యూటీ అడిషనల్ కమిషనర్ మృతి పట్ల నివాళులర్పించారు.  భారతదేశ వీర సైనికుల త్యాగాలను గౌరవించడంతో పాటుగా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, జగిత్యాలపాత్రికేయులు ఈ […]

పాత్రికేయుడు పాకాల రవీందర్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శ

హుజురాబాద్ : పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకుడు, పాత్రికేయుడు పాకాల రవీందర్ రెడ్డి మాతృమూర్తి పాకాల మాణిక్యమ్మ ఇటీవల మృతిచెందారు. ఈసందర్భంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రవీందర్ రెడ్డినీ,అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior […]

భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు. భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధి (National Defence Fund) కి విరాళంగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. “మన దేశ ధీర సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, మన సరిహద్దులను, ప్రజలను […]

విద్యుత్ భద్రత ప్రాణాలకు భరోసా :ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలియా నాయక్

జయహో భారత్ – జై జవాన్ జగిత్యాల జిల్లా : మెట్ పల్లి విద్యుత్ లైన్లలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు బాధ్యతతో పనిచేస్తూ, ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించి విలువైన ప్రాణాలు రక్షించుకోవచ్చని, ఇతరుల ప్రాణాలు కూడా రక్షించవచ్చని జగిత్యాల జిల్లా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శాలియా నాయక్ పిలుపునిచ్చారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెటుపల్లి మండల పరిషత్ లో ఏర్పాటు చేసిన కార్మికుల అవగాహన సదస్సులో పలు సూచనలు చేశారు.క్షేత్ర […]

విశేష ప్రతిభ కనబరిచిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న 22 మంది రియల్ హీరోస్ కు Zee అవార్డ్స్ బహుకరణలో ముఖ్యమంత్రి

తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నందునే ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న 22 మంది రియల్ హీరోస్ కు (పోలీసు) జీ తెలుగు సంస్థ (Zee Awards- 2025) అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఏ దేశం, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయో ఆ ప్రాంతాలు అభివృద్ధి పథంవైపు నడుస్తాయని, తెలంగాణ ప్రశాంతంగా ఉండటానికి […]

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేదు – అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేస్తే చర్యలు:మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు..ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు చొప్పున లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, ఎవరైనా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు వస్తె తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం జరిగి అనర్హులను ఎంపిక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల […]

జగిత్యాల జిల్లానుండి వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోతుందా? ప్రజాప్రతినిధులు సంఘటితం కాకుంటే తప్పదా? 

జగిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు అన్ని జిల్లాల్లో విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు గతంలో మంజూరై, రెండు సంవత్సరాలుగా కోరుట్లలో నడుస్తున్న వ్యవసాయ మహిళా కళాశాల తరలిపోతుందన్న ఆందోళన జిల్లాలోని విద్యావంతుల్లో, తల్లిదండ్రుల్లో,  నెలకొని ప్రధాన సమస్యగా మారింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ తమ శాఖ తరపున వ్యవసాయ మహిళా కళాశాలను మంజూరు గావించారు. అయితే […]

ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎండలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కోరారు. ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాలు పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, అకాల వర్షాలు వల్ల భూమి నుండి వేడి వస్తుందని, ఎండ తీవ్రత కూడా అధికంగా […]

యాదాద్రి జిల్లా కలెక్టర్ దత్తత విద్యార్థి భరత్ చంద్రచారికి 73% మార్కులు – పేరు నిలబెట్టావని అభినందించిన కలెక్టర్ హనుమంతరావు  

యాదాద్రి జిల్లా : ఆయన ఆలోచనలు విభిన్నం, ఆచరణాలు ఉన్నతం, సాధారణ ఉద్యోగం చేసినా, రెవిన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వర్తించినా, పంచాయత్ రాజ్, దేవాదాయ, సమాచార శాఖ కమిషనర్ గా ఏ ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నా తన బాధ్యతలను సక్రమంగా, నిక్కచ్చిగా నిర్వర్తిస్తూ, ప్రభుత్వపరంగా ప్రజలకు, సమాజానికి తన సేవలు అందించాలన్నదే ఆయన దృక్పథం.  ఈనేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా మంత్రిప్రగడ హనుమంతరావు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా, అన్ని రంగాల్లో  ముఖ్యమంత్రి ఆలోచనలకు […]