# Tags

ఆత్మ త్యాగానికైనా వెనకాడబోను : బిజెపిజిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం పేరుతో ఆలయంలో ఉన్నటువంటి ఏ ఒక్క విగ్రహాన్ని తొలగించినా, తాను ఆత్మ త్యాగానికైనా వెనకాడబోనని జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజన్నకు చేసేటటువంటి పూజా కార్యక్రమాలు భీమన్న ఆలయంలో ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాను అభివృద్ధికి అడ్డుపడట్లేదని, […]

హిరోషిమాలో ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు

జపాన్ దేశం హిరోషిమా నగరంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఇద్దరు తెలుగు అమ్మాయిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎదుట తెలంగాణ అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, హిరోషిమా లెజిస్లేచర్ ప్రతినిధిలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించడానికి వెళ్లిన సమయంలో హర్షిణి (8 వ తరగతి), హరిణి (7 వ […]

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) గారితో సమావేశమై పలు అంశాలను చర్చించింది. పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు. […]

ఈ నెల 24న యాంటీ-నార్కోటిక్స్ జిల్లా ఎస్పీ, పోలీసు విభాగం – ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం 

జగిత్యాల : తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీ & C.E.O.., హైదరాబాద్ వారి లేఖ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  ఈ మేరకు యాంటీ-నార్కోటిక్స్ విభాగం,  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు విభాగం మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల సహకారంతో ఈ నెల 24 […]

ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ :ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు

జపాన్‌లోని ఒసాకా : జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. […]

పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులతో కూడిన బృందం కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టెక్యూచి తో సమావేశమైంది. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన […]

సుంకెట గ్రామంలో పోషణ పక్షోత్సవాలు

మోర్తాడ్ : మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసి డిపిఓ జ్ఞానేశ్వరి పోషణ పక్షోత్సవాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కిషోర బాలికలు, గర్భిణీలు, పిల్లలలో రక్తహీనత లాంటి జబ్బులను అరికట్టవచ్చని, అందుకోసమే తన ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణీలకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు.సకాలంలో ఆహారాన్ని […]

గంభీరావుపేట నూతన ఎస్సైగా ప్రేమానంద్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట: (తెలంగాణ రిపోర్టర్ ) : సంపత్ కుమార్ పంజ….. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంకు వేములవాడ నుండి బదిలీపై వచ్చిన ఎస్సై ప్రేమానంద్.2020 బ్యాచ్ కు చెందిన ప్రేమానంద్ స్వగ్రామము మంథని.గంభీరావుపేట మండల ఎస్సైగా ఆదివారం రోజున ఛార్జ్ తీసుకున్నట్లుగా గంభీరావుపేట ఎస్సై ప్రేమానంద్ తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United […]

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, ఏప్రిల్-14: భారతరత్న డా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సోమవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు, మంథని […]

ఆకట్టుకున్న చిరుతల రామాయణం ప్రదర్శన..

గొల్లపల్లి మండలం : దమ్మన్నపేట గ్రామంలో నిర్వహించిన చిరుతల రామాయణం ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. గత నాలుగు రోజులుగా గ్రామస్తులు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నెల 9 న ప్రదర్శన ప్రారంభించగా సీతా రాముల కల్యాణం, వాలీ వధ, యుద్ధ కాండ, రావణాసుర వధ, శ్రీ సీతారాముల పట్టాభిషేకం నిర్వహించారు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శత్రజ్ఞుడు, ఆంజనేయుడు, దశరథుడు, రావణాసురుడు పాత్ర దారులుగా బొలిశెట్టి లక్ష్మణ్, మల్లేశం, సోమ తిరుపతి, ముదాం జానారెడ్డి, […]