మర్తనపేట ప్రాథమిక పాఠశాల పరిశీలనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కోనరావుపేట మండలం మర్తనపేట (రాజన్నసిరిసిల్లజిల్లా, sampath.p) తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలం మర్తనపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారని, […]