# Tags
#తెలంగాణ

లీగల్ సర్వీస్ అథారిటీ కల్పించే సేవలు సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి (తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కామారెడ్డి సెక్రటరీ T. నాగరాణి సందర్శించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో మాట్లాడుతూ పిల్లల బోజన వసతులు ఆరోగ్యం హాస్టల్ లోని కల్పించే వసతులు గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు . పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలలో చేరాలని తెలిపారు. లీగల్ సర్వీస్ అథారిటీ కలిపించే సేవలను సద్వినియోగం చేసుకోవాలిఅన్నారు., కార్యక్రమం అనంతరము హాస్టల్ కిచెన్ మరియు స్టార్ రూం తనిఖీ చేశారు.ఈ కార్యక్రమం లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీ మాయ సురేష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మోహన్ రావు కులకర్ణి, జిల్లా న్యాయసేవాధికార సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి గారు బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ స్వప్న మేడం, డేటా ఎంట్రీ ఆపరేటర్ సాయి కృష్ణ మరియు సిబంది పాల్గొన్నారు