# Tags
#తెలంగాణ

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ:-

చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అదనపు ఎస్పీ చంద్రయ్య

ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ….తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు మధుకర్, రమేష్ ,కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.