#తెలంగాణ #Tech #టెక్ న్యూస్ #హైదరాబాద్

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (T-Fiber) సేవలను ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్ :

• ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలు, ‘మీసేవ యాప్’ సిద్ధం..

• రూ.7,592 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు

• ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం

ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందాలు

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (Telangana Fiber Grid) (T-Fiber) సేవలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం  ప్రారంభించారు.

దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా సంఘంపేట, నారాయణపేట్ జిల్లా మద్దూరు గ్రామాల్లో టీ ఫైబర్ నెట్ సర్వీసులు ప్రారంభం చేశారు.

హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. టీ ఫైబర్ సేవలపై సంగారెడ్డి జల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి ముచ్చటించారు.

టీ ఫైబర్‌తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమల కోసం కొత్త ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ తీసుకోచ్చామన్నారు. ఈ సేవలు కొన్ని సవరణల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

నేటి నుంచి మీ సేవలో మరిన్ని సేవలు..

అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు మీ సేవ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇందులో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చారు. మొబైల్ యాప్ ద్వారా 250కు పైగా సర్వీసులు లభ్యం అవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ మంత్రి ప్రారంభించారు.

పలు సంస్థల ఒప్పందాలు :

మంత్రి శ్రీధర్‌ బాబు సమక్షంలో పలు సంస్థల ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో రూ.1500 కోట్లతో లెన్స్‌కార్ట్‌ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సీతారాంపూర్‌లో సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ ఎంఓయూ కుదుర్చుకుంది. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వంతో ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.

మీ సేవ ద్వారా 150 రకాల పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మొబైల్ యాప్’ సిద్ధం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో కియోస్క్లు ఏర్పాటు చేయనుంది. ఈ యాప్ ఆవిష్కరణతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు ఉద్దేశించిన ‘టీ-ఫైబర్’ ప్రాజె క్టును ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రారంభించనుంది.

దీని ద్వారా ప్రభుత్వ విద్యాలయాలతోపాటు తొలి ఏడాది 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్బ్యాండ్ అందించనుంది.

మరోవైపు ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పరిశ్రమలశాఖ నాలుగు సంస్థలతో రూ.7,592 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకో నుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో ఐటీశాఖ పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభించింది.

టీ-వర్క్స్: జాతీయ భద్రతలో దేశం స్వావలంబన సాధించేందుకు హైదరాబాద్లోని బిట్స్ పిలానీ జాతీయ భద్రతలో పరిశోధన ఎక్స్టెన్స్ కేంద్రం(క్రైన్స్)ను ఏర్పాటు చేసింది. బిట్స్పలానీ క్రెన్స్తో టీ-వర్క్స్ ఒప్పందం చేసుకుంది.

ప్రాజెక్టు సన్మతి: గ్రామీణ, అల్పాదాయ వర్గాల్లోని మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు ప్రాజెక్టు సన్మతి ప్రారంభించింది.. తెలంగాణ ప్రభుత్వం, కార్య సంస్థ సంయుక్తంగా గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత, జీవనోపాధి అవకాశాలు కల్పించ నున్నాయి. తొలుత మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఫైలట్ ప్రాజెక్టు కింద ప్రారంబించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రణాళి కలు ఉన్నాయి.

అందుబాటులోకి కొత్త సేవలు..

ప్రజలు ఇంటి నుంచే పౌరసేవలు పొందేం దుకు వీలుగా ప్రత్యేకంగా ‘మీసేవ యాప్’ను ఐటీశాఖ సిద్ధం చేసింది. దీని ద్వారా 150 రకాల పౌరసేవలు అందనున్నాయి. షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, సమీకృత కలెక్టరేట్లు ఇతర రద్దీప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు పౌరసేవలు పొందవచ్చు. దర వాస్తు నింపడం, చెల్లింపులు చేయడం, సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తారు. మీసేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులు చేర్చింది. పర్యాటక శాఖ హోటల్స్, పర్యాటక ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపుకార్డులు, వయోవృ ద్దుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫి కెట్ల జారీ, ఆటవీశాఖకు సంబంధించి వన్యప్రా ణుల బాధితులకు సహాయం, టింబర్ డిపోలు, కలపమిల్లుల పర్మిట్ల పునరుద్ధరణ, కొత్తవి జారీ, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలించేందుకు అనుమతులు ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *