# Tags
#తెలంగాణ

దేశానికే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఒక రోల్ మోడల్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా(తెలంగాణ రిపోర్టర్ ):-

శాంతి భద్రతల కాపాడటంలో జిల్లా పోలీసు యంత్రాంగం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీస్ డే నిర్వహించారు.

పోలీస్ డే కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, పోలీస్ అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు.ఏ ఉద్యోగంలోనైనా సెలవులు ఉంటాయి కానీ, పోలీసులు వారికి సెలవు లేకుండా నిరంతరం కష్టపడతారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజల అభ్యున్నతికి,ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని,ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే ప్రజా సంక్షేమం,అభివృద్ధి జరుగుతుందన్నారు.జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుందన్నారు.

నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారికి సమాజం పై,పోలీస్ శాఖ పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆయుధాలు వాటి పని తీరు, నెరలు చేధించడం, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్,ఆకతాయిల భారతం పట్టె షీ టీం, అల్లర్లు జరిగినప్పుడు చదరగోట్టే వాహనాలు పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ..
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంపొందించడం కోసం స్టాల్ల్స్ ను ఏర్పాటు చేయడం పట్ల ఎస్పీ ని అభినందించారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ విభాగాల స్టాల్స్ ను సందర్శించడం జరిగిందని, పోలీస్ శాఖ ఉపయోగిస్తూన శాంకేతిక పరిజ్ఞానం గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ…ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 సందర్భంగా పోలీస్ డే నిర్వహించడం జరిగిందని,అందులో భాగంగా హాజరైన విద్యార్థిని విద్యార్ధులకు ఆయుధాలు పని తీరు, డిజాస్టర్ రెస్పాన్స్ టీం,బీడీ టీమ్, పోలీస్ స్టేషన్ పని తీరు, ట్రాఫిక్ నియంత్రణ, షీ టీం పని తీరు, పోలీస్ శాఖలో వినియోగిస్తున్న కమ్యూనికేషన్,ప్రింగర్ ప్రింట్ ,ఐటీ సెల్, సైబర్, గంజాయి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, అల్లర్లు జరిగిన సందర్భంల్లో వినియెగించే వాహనాల కు సంబంధించిన వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి అవగహన కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్,లు,ఎస్.ఐ లు,ప్రజాప్రతినిధులు,విద్యార్థిని విద్యార్ధులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.