#జాతీయం #తెలంగాణ

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  ఎంపికైన ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి  ఎంపికైన సందర్భంలో ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు.

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు తాడూరు సంపత్ కుమార్ మరియు మరొకరు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్ రెడ్డి.

తన జీవిత లక్ష్యం మిషన్-100 భాగంగా 100 మంది తన విద్యార్థులను ఇన్నోవేటర్స్ గా తీర్చిదిద్దిన రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట, జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు తాడూరు సంపత్ కుమార్ తన మొదటి ప్రయత్నంలోనే దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులకు వరించే “జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” కు ఎంపికయ్యారు.

ఈ సందర్భంలో ముందుగా ‘ఆచార్యదేవోభవ’ అంటూ… “తెలంగాణ రిపోర్టర్” శుభాకాంక్షలు అందజేస్తుంది.

సాధారణ ప్రజల బాధలు తీర్చే ఎన్నో ఆవిష్కరణలు తయారు చేయించి, తన విద్యార్థులు దేశ విదేశాల్లో వందలాది అవార్డులు అందుకునేలా ప్రోత్సహించి, తాను పని చేసిన ప్రతి పాఠశాల నుండి ఎందరో బాల శాత్రవేత్తలను తయారు చేసిన సంపత్ కుమార్ కు పలువురు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

తన మొదటి ప్రయత్నంలోనే దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులకు వరించే “జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” గెలుచుకున్న తాడూరు సంపత్ కుమార్ గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు. 

పెద్దపెల్లి జిల్లా చందనాపూర్ పాఠశాలలో పనిచేస్తున్న తరుణంలో మూడు జాతీయస్థాయి అవార్డులు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేటకు వచ్చిన తర్వాత కూడా 3 నేషనల్ లెవెల్ ప్రాజెక్టులు వెళ్లడం జరిగింది.

అలాగే, పదికి పైగా ప్రాజెక్టులు సైన్స్ లో రాష్ట్రస్థాయికి వెళ్లడం, గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతీ సంవత్సరం ఇంటింటా ఇన్నోవేటర్స్ అవార్డు సంపత్ కుమార్  ఆధ్వర్యంలో పిల్లలు స్వీకరించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *