పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన ‘తెలంగాణ రిపోర్టర్’ పాత్రికేయుడు
శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి లక్ష్మి మృతదేహన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసిన పాత్రికేయుడు, సామాజిక సేవకుడు గొల్లపల్లి రవీందర్
-పుట్టెడు దుఃఖంలోనూ, సమాజ సేవపై దృష్టి పెట్టిన ‘తెలంగాణ రిపోర్టర్’ పాత్రికేయుడు గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన నర్సాపురం రవీందర్ ‘తెలంగాణ రిపోర్టర్’ దినపత్రిక పాత్రికేయుడిగా, స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తోటి వారికి ఆదర్శంగా ఉంటున్నాడు.

కేవలం మాటలకు, పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా, శతాధిక వృద్ధురాలైన తన మాతృమూర్తి లక్ష్మి మృతిచెందినా దుఃఖం లో ఉన్నప్పటికీ, సమాజం గురించి ఆలోచించాడు. ఏదో రకంగా, సమాజంలో పవిత్ర వృత్తి లోనున్న వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో మానవ శరీరంపై వైద్య పరిశోధనలకు తన మాతృమూర్తి శరీరం ఉపయోగపడాలని 6 నెలల ముందే జగిత్యాల వైద్యకళాశాల అధికారులకు విన్నవించుకున్నాడు.

కాగా, రవీందర్ మాతృమూర్తి లక్ష్మి ఈ నెల 12న గత ఆదివారం మృతిచెందింది.దీంతో రవీందర్ పుట్టెడు దుఃఖం లో ఉన్నప్పటికీ, బంధుమిత్రులతో చర్చించి, జగిత్యాల వైద్యకళాశాల అధికారులకు సమాచారమందించాడు.

వెంటనే, జగిత్యాల వైద్యకళాశాల బృందం గొల్లపల్లికి చేరుకోగా, దు:ఖాన్ని అదిమిపెట్టుకుని, పాత్రికేయుడు నర్సాపురం రవీందర్ తన మాతృమూర్తి మృతదేహాన్ని మెడికల్ కాలేజీ బృందానికి డొనేట్ చేశాడు.
ఈ సందర్భంగా పాత్రికేయుడు నర్సాపురం రవీందర్ మాట్లాడుతూ, పాత్రికేయుడిగా ఉంటూనే, సమాజ సేవ చేయడంలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నాను.. కరోనా సమయంలో కూడా, బాధితులకు మిత్రుల సహకారంతో వారి వారి ఇండ్లకు వెళ్లి, తన వంతు సహకారం అందించానన్నారు.
ప్రస్తుతం అదే ఒరవడితో ఏదో ఒక రకంగా సమాజంకు ఉపయోగపదాలన్న ఆలోచనతో, వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో మానవ శరీరంపై వైద్య పరిశోధనలకు తన మాతృమూర్తి శరీరం ఉపయోగపడాలన్న ఆలోచనే తనను ముందుకు నడిపించిందన్నారు. శరీర దానంలో ప్రతి ఒక్కరూ, అవగాహన పెంచుకునేలా, వైద్యులు సహకరించాలన్నారు.
ఈ సందర్భంలో ‘తెలంగాణ రిపోర్టర్’ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ తో పాటు పాత్రికేయ బృందం సమాజ సేవలోనున్న రవీందర్ ను అభినందించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





